ప్రణాళిక సమాచారం

యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

DAY 2 OF 40

ఆవేశం,అసూయ మరియు బహుశా అభద్రతాభావం కారణంగా కయీను తన సహోదరుడు హేబెలును చంపడం గురించిన ఈ రోజు పఠనంలో ఆదాము మరియు హవ్వ కుటుంబం యొక్క విచారకర స్థితిని వివరించడం మనం చూస్తాము. కయీను తనకు నచ్చిన దానిని ఎంచుకుని మరియు దేవునికి అసంతృప్తి కలిగించముతో జీవితాన్ని ముగించుకొన్నాడు,అయితే హేబెలు దేవుణ్ణి సంతోషపెట్టుతున్నదానిని తెలుసుకొన్నాడు,మరియు తదనుగుణంగా ఏమి చేసాడు అని చదవడం ఆసక్తికరంగా ఉంటుంది. కయీను ఎల్లప్పుడూ పశ్చాత్తాపపడి మరియు సవరణలు చేయగలిగినప్పటికీ,అతడు ఒక దుర్మార్గపు సత్వర మార్గాన్ని ఎంచుకున్నాడు,అది చనిపోయిన తన తోబుట్టువుతో పొలములో ఒంటరిగా మిగిలిపోయేలా చేసింది.

కయీనుకు మరియు దేవునికి మధ్య జరిగిన సంభాషణ ఒక్కసారిగా విచారంగానూ మరియు అందరిని కలవరపరచినది గానూ ఉంది. జరిగినది అంతా దేవునికి తెలుసు,హేబెలు యొక్క అనవసరమైన మరణం విచారానని కలిగిస్తుంది. కయీను తాను చేసిన హత్య గురించి ఆందోళన చెందినట్లుగా లేడు,ఇది కలవరపరచే అంశం. హేబెలు యొక్క రక్తాన్ని పీల్చుకున్న నేల ద్వారా కయీను ఇప్పుడు శపించబడ్డాడు అని మరియు కాబట్టి అతడు తన మిగిలిన జీవితం దేశదిమ్మరిగా మరియు సంచరించేవాడిగా ఉంటాడని దేవుడు అతనికి చెప్పడంతో ఈ సంభాషణ ఒక చీకటి మలుపు తీసుకుంటుంది.

దేవుడు తన అమితమైన కృపను కయీనును గుర్తించడంలో కనుపరచాడు,తద్వారా అతడు భూమి మీద తన మిగిలిన జీవితంలో ఎవరి చేత హత్య చేయబడడు. అత్యంత నీచమైన పాపులకు కూడా దేవుని యొక్క కృప అందుబాటులో ఉంది. యేసు మీద విశ్వాసం ద్వారా ఈ కృపను అంగీకరించడం మరియు రక్షింపబడడం పాపి మీద ఆధారపడి ఉంటుంది! (ఎఫెసీయులు 2:8)

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీ జీవితం మీద దేవుని యొక్క కృప గురించి మీకు తెలుసా?
మీరు ఇతరుల నుండి కృపను ఎక్కడ నిలిపివేసారు?
మీ జీవితంలో పాపాత్మకమైన వైఖరుల గురించి మిమ్ములను ఒప్పించాలని మీరు దేవుని అడుగుతారా?

వాక్యము

Day 1Day 3

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy