ప్రణాళిక సమాచారం

యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

DAY 5 OF 40

యాకోబు అనేక బిరుదులను కలిగి ఉన్న వ్యక్తి. అబ్రాహాము మనవడు,మోసగాడు,మడమ పట్టేవాడు మరియు తెలివిగల వ్యాపారవేత్త ఆ బిరుదులలో కొన్ని ఉన్నాయి. ఒక రాత్రి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు,ఆ రాత్రి అంతా అతడు ఒక దేవదూతతో పోరాడవలసి వచ్చినప్పుడు తన జీవితం అంతా మార్పు చెందింది. యాకోబు యొక్క దృఢత్వం అతని మేనమామ లాబాను మరియు అతని కుమారుల కారణంగా అనేక సంవత్సరాలుగా వృద్ధి చెందింది. కాబట్టి అతడు దేవుని దూతతో పెనుగులాడడం తెల్లవారు వరకు ఆపడానికి నిరాకరించాడు.

ఈ సమయంలో దేవదూత విడిచిపెట్టబడాలని కోరుకున్నాడు అయితే యాకోబు అతనిని ఆశీర్వదించే వరకు విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఎంత ధైర్యం! మరియు దేవదూత దానిని కూడా చేసాడు. ఆయన యాకోబును తన పేరు చెప్పమని అడుగుతాడు (ఇది ఆయనకు తెలియనందున కాదు) తద్వారా అతడు నిజంగా ఎవరో మరియు ఇప్పుడు తన కోసం దేవుని ఎదుర్కొన్న తర్వాత అతడు ఎవరై ఉన్నాడో తెలుసుకొంటాడు.

పారిపోయిన ఇస్సాకు కుమారుని స్థానం నుండి యాకోబు ఇశ్రాయేలుగా మారాడు ఎందుకంటే అతడు దేవునితో మరియు మనుష్యునితో పోరాడాడు మరియు విజయం పొందాడు. అది ఉన్నత మైన ప్రశంస,మరియు అధికమైన అర్హతతో సమానం. యాకోబు దేవునితో పోరాడటానికి మరియు ఆయన చేత ఆశీర్వదించబడడానికి దేవుని మీద స్థిరంగా ఉండడం,అతని సుముఖత కారణంగా రూపాంతరం చెందాడు. అది పట్టుదల. అది ధైర్యంతో కూడిన విశ్వాసం.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీకు దేవునిని అడుగవలసిన ప్రశ్నలు ఉన్నాయా?
మీరు సందేహంలో లేదా నిరాశలో ఉన్నప్పుడు ఆయనతో పోరాడారా?
మీ జీవితంలో ఆయన ఆశీర్వాదం కోసం మీరు ధైర్యంగా ఆయనను అడిగారా?

వాక్యము

Day 4Day 6

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy