ప్రణాళిక సమాచారం

యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

DAY 4 OF 40

దేవుడు అబ్రాహాముతో స్నేహితుడి వలె మాట్లాడాడు. అబ్రాహాము తన సోదరుని కుమారుడు లోతుకు భూమిని ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చినప్పుడు,దేవుడు తానే స్వయంగా అబ్రాహాముతో మాట్లాడాడు,తన సన్నిధిని గురించి నిస్చయతను ఇచ్చాడు మరియు అతని వారసులను అనేక మందిగా విస్తరిస్తానని అని వాగ్దానం చేసాడు. అబ్రాహాము కనానులోని నిర్జల భూములలో స్థిరపడగా,లోతు సొదొమ మరియు గొమొర్రా నగరాలు ఉన్న యొర్దాను యొక్క సారవంతమైన భూమిని ఎంచుకున్నాడు.

తన కుటుంబం యెడల అబ్రాహాముకు ఉన్న దాతృత్వానికి మరియు నిస్వార్థతకు దేవుడు ప్రతిఫలమిచ్చాడు,అతనిని కొలతకు మించి ఆశీర్వదించాడు. కొన్ని సంవత్సరాల తరువాత ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించబడినప్పుడు,తాను వాగ్దానం చేసిన కుమారుడు గతంలో కంటే సమీపంగా ఉన్నాడనీ,సుదీర్ఘ నిరీక్షణ దాదాపుగా ముగిసింది అని దేవుడు అబ్రాహాము ప్రోత్సహించాడు. దుష్ట పట్టణమైన సొదొమ గురించి తన ప్రణాళికలను అబ్రాహాముతో చెప్పాలా వద్దా అని దేవుడు తనతో చర్చించుకొన్నాడు. దేవుడు అబ్రాహాముతో పంచుకోడానికి ఎంచుకున్నాడు. దీని కారణంగా దేశమును మరియు దాని మనుష్యులను రక్షించడానికి అబ్రహం దేవునితో ప్రాధేయపడడం ఆరంభం అయ్యింది. దేవుడు అబ్రహాం యొక్క షరతులకు అంగీకరించాడు,అయితే విచారకరంగా సొదొమ మరియు గొమొర్రాలు సరిచెయ్య బడలేదు,అవి పూర్తిగా తుడిచివెయ్య బడ్డాయి.

అబ్రహాం యొక్క జీవితంలోని ప్రధాన అంశం దేవునితో కొనసాగుతున్న సాన్నిహిత్యం మరియు స్నేహం. ఇది చాలా కాలం పాటు ఎదురు చూచిన,మరియు విశ్వసించిన ఒక వాతావరణంలో వృద్ధి చెందింది. తన కుటుంబాన్ని విడిచిపెట్టి,తనకు ఏమీ తెలియని దేవుని అనుసరించి విశ్వాసంతో అడుగు పెట్టడం అంత సులభం కాదు. అయినప్పటికీ,తనను పిలిచిన దేవుడు తాను వాగ్దానం చేసిన వాటన్నిటినీ నెరవేర్చగలడనే నమ్మకంతో అబ్రాహాము చేసాడు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీరు సుదీర్ఘకాలంగా వేచి ఉండడంలో మిమ్ములను మీరు కనుగొన్నారా?
ఈ ఎదురు చూడడం ద్వారా మీరు నేర్చుకున్న కొన్ని పాఠాలు ఏమిటి?
వేచి ఉండడములో మీ విశ్వాసం వృద్ధి చెందిందా లేదా కృంగిపోయిందా?
Day 3Day 5

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy