ప్రణాళిక సమాచారం

యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

DAY 1 OF 40

బైబిలు ద్వారా ఈ 40-రోజుల ప్రయాణంలో,దేవునికీ మరియు మనుష్యునికీ మధ్య (లేదా స్త్రీకి సంబంధించినది కావచ్చు) ఒకరితో ఒకరు కలిగియున్న వివిధములైన పరస్పర సంభాషణలను మనం చూస్తున్నాము. ఈ పరస్పర సంభాషణలలో,ఈ సాధారణ మనుష్యుల నుండి దేవుడు ఏమి కోరుచున్నాడో మరియు వారు తిరిగి దేవునికి ఏవిధంగా ప్రతిస్పందించారో మనము చూస్తాము. ఇవి వాస్తవ-లోకానికి సంబంధించినవి,క్రమమైన సంభాషణలే అయితే దేవుడు ఎవరో మరియు వారు ఆయనను ఏవిధంగా అధికంగా తెలుసుకోగలిగారు అనే ఒక తాజా ప్రత్యక్షతతో మనుష్యులు ఎల్లప్పుడు మార్పుచెందుతూ వచ్చారు.

త్రియేక సృష్టికర్త అయిన దేవుడు (ఎలోహిమ్) ఏదెను తోటలో ఆదాము మరియు హవ్వలతో కలిసి నడవడం మరియు వారి భద్రత మరియు శాశ్వత కాల ఆనందం కోసం వారికి సాధారణ హెచ్చరికలను ఇవ్వడం గురించి మనము ఈ రోజు చదువుతాము. వారు ఆయన ఉద్దేశాలను అనుమానించారు,ఆయన ఆజ్ఞలకు అవిధేయులు అయ్యారు,మరియు వారు ఆయనతో ఆనందించిన సహవాసాన్ని కోల్పోయారు.

దేవుడు ఆదామును మట్టి నుండి సృష్టించాడు మరియు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు“మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి;సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.”

ఆదికాండము 1:28,దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హవ్వను సృష్టించాడు మరియు ఆమెకు ఆదాముకు సహాయకురాలు పాత్రను ఇచ్చాడు. యేసు భూమి మీదకు వచ్చే వరకు పరిణమించిన ఈ పతనం ఈ క్రియాశీలతను తీవ్రంగా మార్చింది. ఆయన విమోచన శక్తికి సంబంధించిన ముందస్తు ఛాయ ఆదికాండము 3 వచనం 21లో కనిపిస్తుంది,ఇక్కడ దేవుడు ఆదాము మరియు హవ్వలకు ధరింప చేయడానికి చర్మము యొక్క వస్త్రములు తయారు చేస్తున్నాడు,ఇది రక్తం చిందించడం ద్వారా జరిగింది. యేసు యొక్క పాపరహిత రక్తము మన పాపాలను నిత్యత్వం అంతటి కోసం కప్పివేసింది మరియు మనలను నిష్కళంకముగా కడిగివేసింది. మనం ఆయన కుమారుడైన యేసు ద్వారా దేవునికి దగ్గర కావాలని ఎంచుకుంటామా లేదా చేయి యొక్క పొడవు అంత దగ్గరగా ఆయనను తెలుకోవడం ద్వారా మనం సంతృప్తికరంగానూ మరియు సౌకర్యవంతంగానూ ఉంటున్నామా అనే ప్రశ్న మిగిలి ఉంది.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీరు ఎప్పుడైనా దేవుని యొక్క స్వభావమును అనుమానించారా?
దేవునితో మీ సంబంధం భయం లేదా ప్రేమ చేత ప్రేరేపించబడిందా?
మీరు దేవునితో సన్నిహిత సహవాసం కంటే మీ స్వంత సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారా?
Day 2

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

సంబంధిత ప్లాన్లు

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy