ప్రణాళిక సమాచారం

ఔదార్యంలోని ప్రావీణ్యతనమూనా

ఔదార్యంలోని ప్రావీణ్యత

DAY 5 OF 5

క్రిస్మస్ వృత్తాంతం గురించి ఔదార్యానికి సంబంధించిన మూడు పరిశీలనలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను.

1.ఔదార్యంఅనేది ఎక్కువగా ఒక సద్గుణమైన చర్యగా కంటే అది ఒక సద్గుణమైన ప్రతిస్పందన

మన సమయం,డబ్బు,కీర్తి లేదా మరేదైనా విషయంలో ఔదార్యంగా ఉండిన ప్రతిసారీ మనల్ని మనం అభినందించుకొంటూ ఉంటే మనం స్వనీతితో మిగిలిపోతాం. ఇది నిజానికి మనతో మొదట ఔదార్యంగా ఉన్న దేవుని పట్ల కృతజ్ఞతకు ఒక స్పందనగా ఉండాలి.

2.త్యాగంలో ఉన్న పరిమాణాన్ని బట్టి దేవుడు ఔదార్యాన్ని కొలుస్తాడు.

జ్ఞానులూ, గొర్రెల కాపరులూ బాలుడైన యేసుకు తమ ఆరాధనలో ముఖ్యమైనవాటిని అర్పించారు. అయితే అది మరియ యోసేపులు ఇచ్చినంతగా కాదు. కొందరు చేసిన త్యాగాలతో పోల్చినట్లయితే డబ్బు, సమయం ఇవ్వడం ఔదార్యం శిక్షణ చక్రాలవలె ఉంటుంది.

3.ఔదార్యంస్థాయిలలో పెరుగుదల ప్రతిఫలం, ఆశీర్వాదం స్థాయిలలో పెంపుదలను తీసుకొని వస్తుంది.

జ్ఞానులూ, గొర్రెల కాపరులూ మెస్సీయను చూసారు, ఆయనను గురించి చెప్పారు. అయితే మరియ, యోసేపులు ప్రభువైన యేసు మొదటి అడుగులను గమనించారు, ఆయన యెదుగుతుండగా ఆయనతో హృదయపూర్వకమైన సంభాషణలు కలిగియుండగల్గారు.

ప్రభువైన యేసు చేసిన గొప్ప త్యాగం ఆయనకు ఇంకా గొప్ప ఆశీర్వాదానికి కారణం అయ్యింది. దానిని మనం పంచుతున్నాము. ఆయన ఒక ధర చెల్లించాడు,ఖచ్చితంగా దానిని ఆయన చేసాడు.“ఆయనతన యెదుట ఉంచబడిన ఆనందం కోసం”చేశాడు (హెబ్రీయులు12:2).ప్రేమతో,మనతో సంబంధం కలిగియుండడానికి ఆయన తనను తాను అర్పించుకోవాలని కోరాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వాన మహిమలో ఆశీనుడై ఉన్నాడు, తండ్రితో కలిసి యుగాంతంలో వారి ప్రేమ, సంతోషం నెరవేర్పుకోసం వారు ఎదురుచూస్తున్నారు. త్యాగంలోని స్థాయిల పెరుగుదల ఆశీర్వాదాల స్థాయిని తీసికొని వస్తుంది.

మన లోకాన్ని వెలుపలినుండి దానిని పరిశీలించగలిగితే,మనంఒక కఠినచిత్రాన్ని చూస్తాము. ఈ లోకం ‘పొందడం’, ‘ఉంచుకోవడం,’ ‘నియంత్రించడం’ అనే సూత్రాలపై పనిచేస్తుంది,ప్రతి ఒక్కరూ ఉన్నదానిని పొందుకోవడం కోసం ఒకరికి విరోధంగా మరొకరు పోటీ పడుతున్నారు. అయితే మీరు ఔదార్యం దృష్టితో మానవఅవతారాన్ని చూచినట్లయితే లోకం చేసేదానికి భిన్నమైన సూత్రాలపై దేవుని రాజ్యం పనిచేస్తుందని మీరు నిర్ణయిస్తారు.

క్షమించుడి,అప్పుడు మీరు క్షమింపబడుదురు;ఇయ్యుడి,అప్పుడు మీకియ్యబడును;అణచి,కుదిలించి,దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.” (లూకా6:38).

మనం రాజు ఔదార్యానికి చిన్న అద్దాలుగా మారదాం. అది రాజ్యంలోని జీవితం. అది స్వచ్ఛమైనదీ, నిపుణతతో కూడుకొన్నది. ఇది మన జీవితాన్ని వినూత్నంగా మార్చడం మాత్రమే కాకుండా మన ప్రపంచాన్ని కూడా సమూలంగా మార్చగలదు.

వాక్యము

Day 4

About this Plan

ఔదార్యంలోని ప్రావీణ్యత

ఔదార్యం ఒక నిపుణత. ఈ ఐదు రోజుల పఠన ప్రణాళిక చిప్ ఇంగ్రాం గారు రాసిన ద జీనియస్ ఆఫ్ జెనెరోసిటి పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, మనం నిర్దేశించబడిన విధంగా తెలివైన వ్యక్తులవలె ఏవిధంగా కాగలమో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత వివరిం...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy