ప్రణాళిక సమాచారం

ఔదార్యంలోని ప్రావీణ్యతనమూనా

ఔదార్యంలోని ప్రావీణ్యత

DAY 1 OF 5

క్రైస్తవ జీవితంలో అవసరమైనదీ,అయితేఆకర్షణీయం కాని అంశంగా మీరు ఔదార్యాన్ని“కలిగి ఉండాలి”అని ఆలోచిస్తుండవచ్చు. అలా అయితే,వాస్తవంగాజీవించడానికి ఇది అత్యంత తెలివైన మార్గం అని చెప్పడానికి నాలుగు సాధారణ కారణాలను పరిశీలిద్దాం.

1.ఔదార్యం ఒక ప్రవీణతఎందుకంటే ఇది మన జీవితాలను మారుస్తుంది.

ఉదారంగా ఇచ్చే వ్యక్తులు దాని గురించి ఉన్నతంగా భావిస్తారు, వారు ఎన్నడూ ఊహించని మార్గాల్లో తాము ఆశీర్వదించబడ్డారని గుర్తిస్తారు. వారిలో గొప్ప కార్యాలు జరుగుతాయి, వారి చుట్టూ ఉన్నవారికీ గొప్ప కార్యాలు జరుగుతాయి. స్వీకరించడం కంటే ఇవ్వడం చాలా గొప్ప ఆశీర్వాదం అని ప్రభువైన యేసు చెప్పాడు (అపొస్తలుల కార్యములు20:35).సామెతలు11:25వచనంమనకు ఇలా చెబుతుంది, “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును”

2.ఔదార్యంమమ్మల్ని ఇతరులతో కలుపుతుంది.

ప్రజలు ఉదారంగానూ, కృపతోనూ ఉన్నప్పుడు,వారు ప్రేమనూ, ఆనందాన్నీ వెదజల్లుతారు. దయగల భావన ఉన్నవారిలో చాలా ప్రత్యేకమైన ఆకర్షణీయత ఉంది, ఇతరులకు వారు మేలైన కార్యాలు చేస్తారు, ఇతరుల అవసరాలను గుర్తించి తమ శక్తికి మించి సహాయం చేస్తారు. ఔదార్యంగల వ్యక్తులు వారి సంబంధాలలో సానుకూల భావాలను సృష్టిస్తారు. ఇతరులు తమ చుట్టూ ఉండాలని కోరుకోనేవిధంగా ఉంటారు.

3.మేలైనవాటిలో ఖర్చు చెయ్యడంలోఔదార్యంమనకు సహాయపడుతుంది.

ఔదార్యం ఒక నిపుణత, ఎందుకంటే ఇది అభయాన్ని కలిగించేది, అధిక ఫలాన్ని ఇచ్చే పెట్టుబడి. ఇది కేవలం ఆచరణీయ అంశం కంటే అధికం. ఆత్మీయంగా చెప్పాలంటే ఔదార్యం స్వల్ప లక్ష్యాన్ని కలిగియుండడం నుండీ, మన సమయం, తలాంతులు, మన సంపదలను చెడుగా ఖర్చు చెయ్యకుండా మనల్ని భద్రపరుస్తుంది. దీర్ఘకాలిక సంపదను సృష్టిస్తుంది.

ఒక రకంగా చెప్పాలంటే,మీరు చేసే ప్రతిదీ ఒక పెట్టుబడిగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఒకదానిలో మీ సమయాన్నీ,తలంతునూ, సంపదనూ ఖర్చుచేస్తున్నారు.మీరు దేని విషయంలో ఖర్చు చేస్తున్నారో అక్కడే మీ మనసు ఉంటుంది.

4.ఔదార్యంమన హృదయాలను విడిపిస్తుంది.

మనం చెడుగా ఖర్చు చెయ్యకుండా మనలను కాపాడాలనీ, శాశ్వతమైన వాటిలో మనలను నిలపాలనీ ప్రభువైన యేసు కోరుతున్నాడు. దీనిలోని నియమం మన ఆర్థికపర అంశాలకంటే చాలా ముఖ్యమైనది;ఇది కేంద్ర అంశం.

డబ్బు దేవుని ముందు మన హృదయానికి అద్దంలాంటిది. దేవునితో మీ సంబంధానికి ఖచ్చితమైన ప్రమాణం కావాలంటే,మీ చెక్‌బుక్, మీ క్రెడిట్ కార్డ్ ప్రకటనలను చూడండి. మీ డబ్బు దేనికి ఖర్చు అవుతుందో గమనించండి. దేనికి మీరు అధిక ప్రాదాన్యత ఇస్తున్నారో మీకు తెలుస్తుంది.

జీవితంలో రెండు రకాల సంపదలు ఉన్నాయి: అవి తాత్కాలికమైనవి, శాశ్వతంగా ఉండేవి. ఏవిధంగా ఉండడానికి మనం జీవిస్తున్నామో నిర్ణయించుకోవాలి – ప్రస్తుతం కోసం జీవిస్తున్నామా లేదా నిత్యత్వం కోసం జీవిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. మన దృష్టి దేవునికి చెందిన వాటిమీద ఉంటే,ఆయనేమన ప్రభువు. మన దృష్టి లోకసంబంధమైన వాటిమీద ఉన్నట్లయితే లోకమే మన యజమాని.

Day 2

About this Plan

ఔదార్యంలోని ప్రావీణ్యత

ఔదార్యం ఒక నిపుణత. ఈ ఐదు రోజుల పఠన ప్రణాళిక చిప్ ఇంగ్రాం గారు రాసిన ద జీనియస్ ఆఫ్ జెనెరోసిటి పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, మనం నిర్దేశించబడిన విధంగా తెలివైన వ్యక్తులవలె ఏవిధంగా కాగలమో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత వివరిం...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/

సంబంధిత ప్లాన్లు

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy