ప్రణాళిక సమాచారం

ఔదార్యంలోని ప్రావీణ్యతనమూనా

ఔదార్యంలోని ప్రావీణ్యత

DAY 2 OF 5

ఔదార్యం ఒక రమ్యమైనపదం,కదూ!ఇది నాలుక నుండి సులభంగా ప్రవహిస్తుంది, ఆనందకరమైన,అపరితంగాఇవ్వడం, స్వీకరించడంలోని చిత్రపటాలను అధికంగా చూపిస్తుంది.

మరోవైపు,జవాబుదారీతనం అనేకమందికి భారంగానూ, మరికొంతమందికి అధికభారంగానూ ఉంటుంది– ఖర్చుచెయ్యడం విషయంలో బాధ్యత, కఠినమైన హద్దులు ఉంటాయి.

అయితే వాక్యానుసారమైన జవాబుదారీతనం వాస్తవానికి ఒక రమ్యమైన అంశం, ఎందుకంటే ఇది దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన ఆధిక్యత. ఔదార్యం ఒక నిపుణతగా ఉండడంలో జవాబుదారితనం కీలకం.

దేవుడు సమస్తాన్ని కలిగి ఉన్నాడు అనే అవగాహన నుండి నిజమైన ఔదార్యం ప్రవహిస్తుంది. ఆయన క్రమంలో,మంచి జవాబుదారీతనం స్వభావసిద్ధంగా ఉదారంగానూ, ఆనందంగానూ ఉంటుంది;ఇది ఆయనవనరులను ఆయన ఉద్దేశాల వైపుకూ, ఆయన ప్రజలు లోతుగా ఆనందించడానికీ సహాయపాడడంలో అపరిమితంగా ఉంటుంది. ఔదార్యాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలంటే జవాబుదారీతనాన్ని నూతన దృష్టికోణంలో చూడాలి –అయిష్టతతో కూడిన బాధ్యతగా కాకుండా ఉత్తేజకరమైన అవకాశంగా చూడాలి.

మనం కలిగియున్నవన్నీ దేవునికి చెందినవని నమ్మడం ప్రాముఖ్యమైన అంశం. ఈ సత్యం మన హృదయాలలో లోతుగా చొచ్చుకొనిపోవడం, దానిని గుర్తించడమూ, దాని గురించిన అవగాహన కలిగియుండడమూ మరొక ప్రాముఖ్యమైన అంశం. అది జరిగినప్పుడు,మన జీవితాలు రూపాంతరం చెందుతాయి.

మనం కేవలం సిద్ధాంత సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండడం నుండి ఆచరణాత్మక నిపుణతకలవారంగా మార్పు చెందుదాము. కర్తవ్య భావన నుండి ఆనందం వైపుకు మనం వెళ్దాము. మనం పాటించే నియమాల నుండి మనం పంచుకునే సాహస కార్యం వరకూ వెళ్దాం. దేవుడు మనకిచ్చిన సమయం విషయంలో ఏమి చేద్దాం లేదా ఆయన డబ్బును ఏవిధంగా ఖర్చు చేద్దాం అని ప్రతీ ఉదయం మనం లేచినప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు మనకప్పగించిన మన జీవిత భాగస్వామితోనూ, పిల్లలతోనూ లేదా మన జీవితంలో ఆయన ఉంచిన స్నేహితులతోనూ ఏవిధంగా సంబంధాన్ని కలిగియుండాలో ఆలోచన కలిగియుందాము.

దీనిలో ఉన్న నియమం ఇది: మనం కలిగియున్నవన్నీ దేవునికి చెందినవి,ఆయన తనఇష్టానుసారం వాటిని పర్యవేక్షించడానికి ఆయన తాత్కాలికంగా మనకు అప్పగించాడు. దేవుని గృహసంబంధ విషయాలకు మనం నిర్వాహకులం.

పాతనిబంధనలోని యోసేపు జీవిత వృత్తాంతంలో దీనికి చెందిన గొప్ప చిత్రం మనకు దొరుకుతుంది.పోతీఫరు తన ఇంటి బాధ్యతలన్నింటికీ యోసేపును గృహ నిర్వాహకుడిగా నియమించాడు. అతడు యోసేపును పర్యవేక్షకునిగా నియమించాడు, అధికార పత్రాన్ని ఇచ్చాడు. ఆయన గృహాన్ని యోసేపు చక్కగా నిర్వహించాడు, సరియైన వివరాలను కొనసాగించాడు, తన యజమానికి నివేదించాడు.

ఈ సూత్రంతో నేను నొక్కిచెప్పదలిచిన విషయం ఏమిటంటే దేవుడు ప్రతిదీ కలిగి ఉన్నాడు, మనం ఆయన గృహనిర్వాహకులం అని కాదు. అంతకుమించిన లోతైన అంశం ‘నమ్మకం’ – సంబంధాల అంశం. ఇందుకుగాను ఒక నమ్మదగిన గృహనిర్వాహకుడు అవసరం. మన దగ్గర ఉన్న ప్రతిదానిని దేవుడు ఒక ఉద్దేశంతో మనకు అప్పగించాడు - కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడడానికి మనం ఆయనతో భాగస్థులం కావచ్చును. నిజమైన మన ప్రాధాన్యతలు ఎక్కడ ఉన్నాయో మనం ప్రదర్శించగలము.

Day 1Day 3

About this Plan

ఔదార్యంలోని ప్రావీణ్యత

ఔదార్యం ఒక నిపుణత. ఈ ఐదు రోజుల పఠన ప్రణాళిక చిప్ ఇంగ్రాం గారు రాసిన ద జీనియస్ ఆఫ్ జెనెరోసిటి పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, మనం నిర్దేశించబడిన విధంగా తెలివైన వ్యక్తులవలె ఏవిధంగా కాగలమో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత వివరిం...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy