ప్రణాళిక సమాచారం

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

DAY 9 OF 10

అన్యాయం జరిగిన సమయంలో 


బహుశా మీరు అన్యాయానికి సంబంధించిన భావోద్వేగాలను అనుభవించియుంటారు. ఒకవేళ మీరు విడిచిపెట్టబడిన  బాధను అనుభవించియుండవచ్చు, వ్యాపార భాగస్వామి ద్రోహం చేసియుండవచ్చు వారసత్వం నుండి తొలగించబడిన ఆందోళనలో ఉండి ఉండవచ్చు, అందరి కంటే అధికంగా కష్టపడుతున్నప్పటి నిరాశలో ఉండవచ్చు, నీకంటే ముందుగా మరొకరు పదోన్నతి పొందుతుండవచ్చు. ఒకవేళ శిక్షకుని పిల్లలు మాత్రమే ఆడడానికి అవకాశాన్ని కలిగియుండి మీ పిల్లలు మాత్రం బల్లమీద కూర్చొనే పరిస్థితి ఉండవచ్చు. దానిని వివరించడానికి మీరు కలవర పడుతుండవచ్చు. అసౌకర్యమైన లావాదేవీలు చేసుకోవడం మానసికంగా కలవరపెడుతుండవచ్చు. అన్యాయం మనలను దహించివేస్తుండ వచ్చు.


క్రీస్తు నిమిత్తం ఒక దీర్ఘకాలిక సంబంధాన్ని త్యాగం చేసిన తరువాత కళాశాలలో ఆ విధంగా అనుభూతి చెందడం నాకు జ్ఞాపకం ఉంది. దేవుడు దానిని నాకు తిరిగి ఇస్తాడు అని ఆశిస్తున్నాను, నా మాజీ ప్రియురాలు మరొక వ్యక్తితో కలిసి దూరంగా వెళ్ళడం చూడడానికి మాత్రమే. నేను నా వసతి గదిలో నా బైబిలు తెరిచి, దేవునికి చివరి ఆశను తెలియపరచాను. నాతో మాట్లాడండి లేదా నేను విడిచిపెడతాను. నేను కీర్తనల గ్రంథాన్ని చదువుతున్నాను, నేను అన్నింటినీ వదులుకునే ముందు ఆయన నాతో మాట్లాడడానికి ఆయనకు మూడు లేదా నాలుగు అధ్యాయాలు ఇవ్వబోతున్నాను. మొదటి రెండు నామీద ఎలాంటి ముద్ర వేయలేదు. అప్పుడు నేను 73 వ కీర్తనను చూశాను, వెంటనే భిన్నమైన అనుభవాన్ని నేను గ్రహించాను. దేవునితో సన్నిహిత సంబంధానికి అది నడిపించింది. అది నన్ను పూర్తిగా మార్చివేసింది. ఇంకా నా కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి, గందరగోళం నా ఆత్మను కమ్మివేసింది, నేను ఆ కీర్తనను గట్టిగా చదివాను. కీర్తనాకారుడు చేసిన ఫిర్యాదులలో నా స్వంత మాటలు విన్నాను.


  


దేవుడు చెప్పినది సరైనది అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నందున నేను ముడిలలో కట్టబడి ఉన్నాను. , అయినప్పటికీ క్రైస్తవుడిగా నాకు ఇంతకు ముందు ఉన్నదానిని గుర్తుంచుకోగలిగిన దానికంటే ఎక్కువ సమస్యలూ, నిరాశలూ ఉన్నాయి. కీర్తనాకారుని వలె, “అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు, నాకు ఆయాసకరముగా ఉండెను.” (వ.16). కీర్తనాకారుని వలే పరిష్కారాలు నా యెదుటనే ఉన్నాయి, “నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ధ్యానించువరకు” (వ.17). జీవితాన్ని శాశ్వతమైన దృష్టికోణం నుండి చూడటం ప్రారంభించాను.


  


అందరికంటే పైనున్న దేవుణ్ణి ఆరాధించు – అంతిమంగా తన ప్రజలను సమర్థించేవాడు-మన అన్యాయ భావనను వేరు చేస్తాడు. ఆయన వాగ్దానాలూ, ఆయన దృక్పథమూ బాధను తగ్గిస్తాయి. ఇప్పుడు అన్యాయంగా కనిపించేది చివరికి తన ప్రజలకు అత్యధికంగా క్షేమాన్ని కలిగిస్తుంది. మన హృదయాలు మృదువు చేస్తాయి, మన దృక్పథం మార్పు చేస్తాయి. 26 వ వచనంలోని కీర్తనాకారుని మాటలతో మనమూ సంతోషిద్దాము, “నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.”

వాక్యము

Day 8Day 10

About this Plan

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy