ప్రణాళిక సమాచారం

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

DAY 8 OF 10

మీకు ఆనందం అవసరమైనప్పుడు


తన శిష్యులు ఆనందంతో నిండి ఉండాలని యేసు కోరుకున్నాడు (యోహాను 15:11). దేశ బహిష్కృతులుగా ఉండి తిరిగి వచ్చి కన్నీటితో ఉన్న సమూహానికి నెహెమ్యా ఇలా చెప్పాడు, “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” (నెహెమ్యా 8:10). పౌలు తన లేఖలలో ఒకదానిని సంతోషకరమైన మాటలతో నింపాడు, తన పాఠకులు ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషించమని చెప్పాడు (ఫిలిప్పీ 4:4). దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉందని దావీదు  చెప్పాడు (కీర్తన 16:11) మోషే తన ప్రజలను నిరంతర ప్రేమతో సంతృప్తిపరచమని దేవుణ్ణి కోరాడు, తద్వారా వారు తమ ఆనందం కోసం పాడటానికీ, జీవితకాలమంతా సంతోషంగా ఉండడగల్గుతారు. (కీర్తన 90:14) లేఖనం ప్రకారం, మన ఆనందం దేవునికి గొప్ప సంగతి.


మన జీవితంలో దేవుడు పని చేస్తున్నాడనే దానికి ఆనందమే రుజువు. దేవునికి మన భావోద్వేగ ప్రతిస్పందనలు కొన్ని సమయాల్లో మారుతూ ఉంటాయి, ఆయన మనకు అందించే ఆనందాన్ని మేము ఎప్పుడూ అనుభవించము. అయితే మనం ఆయన కార్యాన్ని స్థిరంగా గుర్తించినప్పుడూ, ఆయన వాగ్దానాలను హత్తుకొన్నప్పుడూ, ఆయన క్షమాపణను స్వీకరించినప్పుడూ, ఆనందం ఉప్పొంగడం ఆరంభం అవుతుంది. ప్రతికూలమైన, గందరగోళ పరిస్థితుల మధ్య కూడా.


మన జీవితంలో దేవుని సన్నిధి, ఆయన శక్తి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది, కనీసం అంతిమమగా కలిగిస్తుంది. మనం ప్రభువు ఆనందాన్ని అనుభవించినప్పుడు, మన పరిస్థితులు మారకపోవచ్చు, కాని వాటిమీద మన దృక్పథం సమూలంగా మారుతుంది. సమస్యలతో మునిగిపోవడానికి బదులు మనం సమస్యలను దేవుని కృప, ఆయన శక్తి ద్వారా చూడటం ప్రారంభిద్దాం.


సంవత్సరాలుగా, నేను ప్రభువు ఆనందాన్ని అనుభవిస్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకోవడం నేర్చుకున్నాను. ఇది కట్టుదిట్టమైన పద్ధతి కాదు, అయితే నా జీవితాన్ని నడిపించడానికీ, మార్గదర్శకత్వం వహించడానికీ పరిశుద్ధాత్మను నేను ఎంతవరకు అనుమతిస్తున్నానో వివేచించడానికి ఈ విశ్లేషణ ప్రశ్న నాకు సహాయపడుతుంది. క్రైస్తవ జీవితం ‘ఖచ్చితంగాచెయ్యాల్సినవి’, ‘తప్పనిసరిగా చెయ్యాల్సిన’వాటిని అనుసరించవలసినట్టుగా భావించినప్పుడు నా హృదయంలో దేనివిషయంలోనో నేను గమనాన్ని కలిగియుండవలసి ఉందని నాకు తెలుసు.


దేవుని ఆనందంలో మన అనుభవాన్ని కొనసాగించడానికి లోతైన, యదార్ధమైన, సన్నిహితమైన, క్రమమైన ప్రార్థన సమయాలు ముఖ్యమని నేను నమ్ముతున్నాను. పరుగెడుతూగానీ, కారును నడిపిస్తున్నడు గానీ లేదా ఒక కప్పు కాఫీ తాగేటప్పుడు గానీ ప్రార్థించడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు నిజమైన చోట ప్రార్థన చేస్తారు, మీరు తెరుస్తారు మరియు మీరు దేవునితో మాట్లాడతారు. మీ హృదయం ఖాళీ అయ్యేంత వరకూ మీ హృదయాన్ని కుమ్మరించాలి. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు, ఆయన ప్రేమ వెలుపలికి వస్తుంది. ఆయన వాగ్దానాల వాస్తవికత మీ నివాసస్థలం అవుతుంది. అది మీ చుట్టూ ఉంటుంది, దయతో నిండిపోతుంది. ఆయన హస్తాలు మిమ్మల్ని చుట్టుముట్టుతాయి. మీ హృదయం, మరోసారి, ఆనందంతో నింపబడడం ప్రారంభం అవుతుంది.

వాక్యము

Day 7Day 9

About this Plan

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy