ప్రణాళిక సమాచారం

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

DAY 1 OF 10

సంక్షోభ సమయాలు


ఇంటిలో చెత్తను తీసే బాధ్యత ఎల్లప్పుడూ నా కుటుంబంలోని చిన్న పిల్లవాడి మీద పడిపోతుంది. అది అతి తక్కువ పని. అయితే ఒక పురాతన హెబ్రీ కుటుంబంలో, అతి తక్కువ పని గొర్రెలను కాయడం. గొర్రెల కాపరి వాటితో కలిసి ఉండవలసి వస్తుంది. వాటి అవసరాలను తీర్చాలి, వాటిని రక్షించాలి, వాటిని నడిపించాలి. ఇశ్రాయేలు రాజు అయ్యి 23 వ కీర్తన రాసిన యెష్షయి చిన్న కుమారుడైన దావీదుకు గొర్రెల కాపరి గురించి చాలా తెలుసు.


దేవుడు చేసిన కలిసికట్టు జంతువులలో గొర్రెలు ఉన్నాయని దావీదుకు తెలుసు. అవి నెమ్మదిగానూ, తేలికగా భయపడేవిగానూ, రక్షణ లేనివిగానూ, తమ సొంతంగా ఆహారంగానీ లేదా నీటిని గానీ సంపాదించుకోలేనివిగానూ ఉంటాయి. ప్రవాహాన్ని నిరోధించగలిగే గొర్రెల కాపరి వాటికి అవసరం, ఎందుకంటే ఆ ప్రవాహం శబ్దం వాటిని  భయపెట్టదు, గొర్రెలు గడ్డిని దాని మూలాలతో పాటు తినిన తరువాత వాటిని కొత్త పచ్చిక బయళ్లకు నడిపించడానికి వాటికి కాపరి అవసరం. వేటాడే జంతువుల నుండి వాటిని రక్షించడానికీ, తమను తాము కాపాడుకోలేని నైపుణ్యాల విషయ అజ్ఞానం నుండి వాటిని కాపాడడానికి వాటికి కాపరి అవసరం. గొర్రెల కాపరి లేకుండా, ప్రమాదమూ, గొర్రెలనూ కలిసినప్పుడు అది మరణానికి సమానం. గొర్రెల కాపరితో ఉన్నప్పుడు, గొర్రెలు పచ్చిక బయళ్లను ఆస్వాదించగలవు, నెమ్మదైన నీటి నుండి త్రాగవచ్చు, భద్రంగా జీవించగలవు.


23 వ కీర్తనలోని దేవునికీ, ఆయన ప్రజలకూ మధ్య ఉన్న సంబంధం చిత్రపటాన్ని దావీదు మనకు ఇస్తున్నాడు. ఈ చిత్రం దాని మొదటి పాఠకులకు చాలా ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు –సృష్టిలోని అతి తక్కువ జంతువులను జాగ్రత్తగా చూసుకునే చిన్న పనిని దేవుడు కలిగియున్నాడు. అయితే ఒక గొర్రెల కాపరి తన నిస్సహాయ గొర్రెలను కాయడం అనేది మృదువుగానూ, కరుణ, కాపుదలలో ఉన్న సన్నిహిత చిత్రాన్ని చూపిస్తుంది. దేవుడు మనతో ఇటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడు. ఇది మనకు ఖచ్చితంగా అవసరమైన సంబంధం ఇదే, ప్రత్యేకించి సంక్షోభం సమయంలో మనకు అవసరం.


“యెహోవా ఒక కాపరి”అని దావీదు చెప్పడం లేదని గమనించండి. “యెహోవా నా కాపరి”అని చెపుతున్నాడు. ఈ దేవుడు వ్యక్తిగతమైనవాడు-అత్యున్నతమైనవాడు, పరిశుద్ధుడూ, మహిమ గల దేవుడు మాత్రమే కాదు, అయితే మన జీవితాలలో ఉండేదేవుడు, మన జీవితాలలో ప్రతీ చిన్న విషయంలోనూ మనలను కాపాడే దేవుడు కూడా. ఆయన తన గొర్రెలను చూసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, పోషిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రతిదానికీ మనం ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటాడు.


ప్రభువైన యేసు తాను “మంచి గొర్రెల కాపరి”(యోహాను 10:11)గా చూపించుకొన్నాడు. ఎందుకంటే మనకు ఉన్న ప్రతి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఆయన కట్టుబడి ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఊహించిన దానికంటే ఆయన అధికమైన శ్రద్ధ చూపిస్తాడు. ప్రతీ బాధ, సమస్య, భయం ఆయన  యెరుగును. ఆయన అతను మనలను సురక్షితమైన పచ్చిక బయళ్ళలోకి నడిపించాలని కోరుకుంటున్నాడు. భయంకరమైన మన సంక్షోభాలలో కూడా ఆయన మనలను నడిపించాలను కోరుకుంటున్నాడు. మన జీవితాలతో ఆయనను నమ్మవచ్చు.

వాక్యము

Day 2

About this Plan

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy