ప్రణాళిక సమాచారం

ఈస్టరు కథనమూనా

The Story of Easter

DAY 5 OF 7

శుక్రవారము



పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ విధముగా కావాలని కోరుకున్నాడు "ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట." ఈ భయంకర సన్నివేశాన్ని అనుభవించాలని కోరుకోవటం అసాధ్యం అనిపిస్తున్నప్పటికీ, ఈ కథ మనకు నిజంగా క్రీస్తును తెలుసుకోవటానికి అద్భుతమయిన అవకాశాన్ని ఇస్తుంది. హింసలో కూడా శాంతి, సంతోషము, సమాధానము, మరియు కృప ప్రకాశించటము గమనిస్తే, ఆయన మరణములో ఆయనవలె మార్పుచెందే అందమైన ప్రక్రియ చూడవచ్చు. దేవుడిని సంపూర్తిగా నమ్మే ఆయన జీవితం ఎంత సాధారణమైనది. ఆయనకి ఎటువంటి లోక సంబంధమైన చింత లేదు కానీ తన తల్లిని మాత్రం తనకు ప్రీతిపాత్రమైన స్నేహితుడికి అప్పగించాడు. ఆయన ఏకైక ఆస్తి అయిన తన వస్త్రం ఒక జూదపు సైనికుడి చెంతకు చేరిపోయింది. ఆ నిరాడంబరత. ఆ స్పష్టమైన ఏకాగ్రత. దేవుని చిత్తానికి ఆయనకుగల సమర్పణ. ఆయనకు తన తండ్రియందుగల సంపూర్ణమైన నమ్మకం. ఇవే మనము కోరుకోవలసినవి.

వాక్యము

Day 4Day 6

About this Plan

The Story of Easter

ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్ర...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy