ప్రణాళిక సమాచారం

విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుటనమూనా

Making Time To Rest

DAY 4 OF 5

దృష్టి మళ్ళించే వాటినుండి వైదొలుగుట.



నీ చుట్టూ ఉన్న ప్రపంచము నుండి బయటకు వచ్చుటకు నీవు సమయమును వెచ్చించక పోయినట్లయితే, అది మిమ్మల్ని దానితోపాటే ఈడ్చుకుని వెళ్తుంది. - ఎర్విన్ మెక్ మేనస్



విశ్రాంతి కున్న నిర్వచనాలలో ఒకటి ఏమనగాఆందోళన లేక అంతరాయముల నుండి విడుదల పొందటమే.ఈ సమయములో మన జీవితములలోని, మన విశ్రాంతికి భంగము కలిగించి ఆందోళనపరచే సంగతులను చాలా సులువుగా కనుగొనగలము. మనము వాటిని ఆ క్షణమందు ఆనందం కలిగించేవిగా మరియు మనల్ని ఉత్తేజింప జేసినట్లు అనిపించినప్పటికి, ఆఖరికి నిజమైన విశ్రాంతి నుండి అవి మనల్ని తప్పించాయని తెలుపును.



అత్యాధునికమైన ఈ ప్రస్తుత ప్రపంచం నుండి వైదొలుగుటకు చేసే పలుమార్గాల గూర్చి అనేకమంది మాట్లాడారు. మన దృష్టిని మళ్ళించే వాటినుండి ప్రక్కకి వచ్చేందుకు మూడు దశల గురించిన పుస్తకములు, వ్యాసాలు, పాడ్ కాస్ట్లు మరియు సందేశములు కలవు. కాని అందరూ ఒకే రకమైన విషయాలలో మళ్ళించ బడుటలేదు. ఒకరికి శోధనగా ఉన్నది తనపక్కనున్న వ్యక్తికి శోధన కాకపోవచ్చును.



మన జీవితములలో దృష్టి మళ్ళించే వాటినుండి విడిపింప బడుటకు, మనము రెండు విషయములను గమనించాలి. మొదటగా, ఏది మనల్ని దారితప్పిస్తుందో తెలుసుకోవాలి. అవి మనల్ని ముఖ్యమైన సంగతుల నుండి ప్రక్కకి తప్పించును ఎందుకనగా ఆ సమయమునకు అవి అత్యవసరముగా అనిపించును లేక అవి వాటిని చేస్తే స్వల్పకాల సంతోషాన్నిచ్చేవిగా ఉండును. రెండవదిగా, మన అజెండాలను దించివేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, తద్వారా మన జీవితంలోని అతిప్రాముఖ్యమైన వ్యక్తులను మనకి పరధ్యానంగా భావించకూడదు.



మనలోని సమాధానమును మరియు విశ్రాంతిని దొంగలించేది ఏదైనా సరే, వాటికి మనం హద్దుల్ని పెట్టుకోవాలి. ఈ మాటల్ని చదివిన తరువాత, అసలది ఏంటి అని మనకి స్పష్టముగా తెలియబడును. మన జీవితంలో అతిప్రాముఖ్యమైన వ్యక్తుల నుండి మరియు మన విశ్రాంతి నుండి దృష్టి మళ్ళించే వాటికి మనం అనుమతివ్వక పోయినప్పటికీ, బహుశా మనమే...




  • ...మన పిల్లలు మెలకువతో ఉన్నప్పుడు, పనిచేసుకొనుటకు మన కంప్యూటర్ తెరవకుండా ఉండటమే.

  • ...ఈ లోక చింతలపై కాకుండా ఉన్న మంచి మీద మన దృష్టి పెట్టుటకు ఎన్నుకోవటమే.

  • ...మన కుటుంబ సభ్యుల కొరకు ఒక ప్రత్యేకమైన రింగ్ టోన్ పెట్టుకుని, మిగతావారికి ఒక వాయిస్ మెయిల్ పంపండి.

  • ...ఈ వారము చివరవరకు టీవీ చూడకూడదని నిర్ణయించుకోండి.

  • ...భవిష్యత్తు కొరకు మనము వేసుకున్న ప్రణాళికల్ని ప్రక్కన పెడదాం తద్వారా ప్రస్తుతములో మనం జీవించవచ్చును.

  • ...వెబ్ సైట్లకు, యాప్స్ కు లేక వీడియో గేమ్స్ కు కొంత సమయమని పెట్టుకోండి.


నిత్యము ఆందోళన మరియు కలత చెందుతున్న స్థితిలోనే ఉన్నట్లు మనకు అనిపిస్తే, మనకు అలాంటి అనుభూతిని కలిగించే వాటినన్నిటిని తగ్గించాలి లేదా తొలగించాలి. ఇలా చేయటం అంత సులువేమీ కాదు. విలువగలదేనికైనా మన కష్టమును మరియు త్యాగమును కోరును. దేవుని మనకు అనుగ్రహించే గొప్ప విశ్రాంతి నుండి దూరం చేసే ఈ లోకము యొక్క పరధ్యానములను ఇంకొక్క రోజు కూడా అనుమతినివ్వకండి.



ఆలోచించండి




  • నిజమైన విశ్రాంతి నుండి మిమ్మల్ని దూరపరచే ఆ పెద్ద విషయము ఏమిటి?

  • మీ జీవితంలో ఈ పరధ్యానాన్ని తొలగించడానికి లేదా పరిమితం చేయడానికి మీరు ఈ రోజు ఏం చర్యలు తీసుకుంటారు?

  • ఈనాటి బైబిల్ ధ్యానము లేక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రత్యేక్షతను వ్రాసుకోండి

Day 3Day 5

About this Plan

Making Time To Rest

మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, వి...

More

ఈ బైబిల్ ప్రణాళికను రూపొందించి మీకందించిన వారు YouVersion.

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy