ప్రణాళిక సమాచారం

విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుటనమూనా

Making Time To Rest

DAY 3 OF 5

మీ ఆలోచనలను వ్రాసి పొందుపరచుకొనుట ద్వారా మీ మనస్సును నూతనపరుచుకోండి


నీవు దేని గురించి ఆలోచిస్తావో దానిలో నువ్వు ఎదుగుతావు. కావున, నీవు దేనిగుండా వెళ్ళుతున్నావనే దానిపై నీ మనస్సుంచకు. దేనిని చేయాలనుకుంటున్నావన్న దానిపైనే నీ దృష్టిని కేంద్రీకరించు! - డా. కారోలిన్ లీఫ్


నిన్నటి రెండవ దినమున, మన యొక్క క్రియలు దేవుని సత్యములతో అనుసంధాన మగుటకు దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా విశ్రాంతిని పొందుకొనగలమనే విషయాన్ని తెలుసుకున్నాము. మన ఆత్మలోనికి లేఖనములను ఇమిడింప చేసికొనుటకు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఆయన సత్యము ఖచ్చితముగా మన మనస్సులో నింపబడును, తద్వారా పరిస్థితులను క్రొత్తగా చూడగలుగుతాము. దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉండంగా, మన మనస్సు నూతనపరచబడి మనము ఊహించని శైలిలో ఆయన విశ్రాంతిని పొందుకొనగలము.


దేవుని వాక్యముతో మనము గడిపే సమయమును పూర్తిగా సద్వినియోగం చేసుకొనవలెనంటే, ఆ తలంపులను ఒకచోట వ్రాసి పొందుపరచుకొనుటను అనుదిన అలవాటుగా మనము చేసుకోవాలి. చాలా లోతైన లేక మనం అనుసరించలేని గూడార్థమైన విశేషములతో కూడినదిగానే ఇది ఉండాల్సిన పని లేదు. బైబిల్ చదువుతుండంగా మనము గ్రహించిన దానిని గూర్చి కొన్ని విషయములను వ్రాసినా సరిపోతుంది. ఈ విధముగా పొందుపరచుటకు అనేక మార్గాలు కలవు. మన యొక్క ఆలోచనలను లేక ప్రార్థనలను వ్రాయవచ్చును; ఈ విధముగా చేసే సమయములో కొంతమంది దానికి సంబంధించిన చిత్రాలను కూడా గీస్తుంటారు. దీనికి ఒక్కటే మార్గము అన్నట్లు ప్రత్యేకముగా లేదు. మీరు మొదలుపెట్టుటకు సహాయమందించుటలో భాగంగా, మీరు అనుసరింపదగిన ఒక సులువైన పద్ధతిని ఇక్కడ చూడవచ్చును:


  • ఒక వచనమును (లేక కొన్ని వచనములను) ఎంచుకొని వాటిని చదవండి.
  • మరలా చదవండి.
  • దానిని వ్రాయండి.
  • దానిని గూర్చిన గ్రహింపు కొరకు దేవుని అడగి దానిని వ్రాసుకోండి.

ఒకవేళ మీరు రోమా 8:28ని గురించి వ్రాయాలని నిశ్చయించుకున్నట్లయితే," దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము."ఒకటికి రెండు మార్లు దానిని చదివిన పిమ్మట మనము దానిని వ్రాయుదుము. వివిధ బైబిల్ వెర్షన్లలో అదే వచనమును వ్రాయుటకు కూడా మనము ఎంచుకొనవచ్చును. మనము చదివిన దానిని గూర్చిన గ్రహింపు కొరకు దేవుని అడుగుటతో మనము వ్రాయు సమయమును ముగిస్తాము.


పైన చూపబడిన ప్రకారముగా వాక్యమును ధ్యానిస్తూ ఉండంగా, ఈ రోజంతటిలో దానిని మన మదిలోనికి వెళ్ళేలా చేసుకొనవచ్చును. ఈ విధముగా ప్రతిరోజు చేయుట ద్వారా మనలోని ఆత్మీయ ఎదుగుదల యొక్క కాలక్రమమును మరియు గతములో దేవుడు మనతో నూతనముగా మాట్లాడిన సంగతులను కూడా చూసుకొనవచ్చును.


దేవుని వాక్యము మన జీవితములకు ఎలా అన్వయింప చేసుకొనవచ్చునో మరియు మన అంతరంగము నుండి బాహ్య శరీరమువరకు అది ఎలా మనలను బాగుచేస్తుందో అనే విషయముపై క్రొత్త పంధాను మనము కనుగొనుట ద్వారా మన పరిస్థితులను స్పష్టముగా చూడగలము. మరియు మన మనస్సు నూతనపరచబడుట చేత, ఈ లోక భోగములేవి కూడా అందించలేని విశ్రాంతిని మనము పొందుకొనగలము.


ఆలోచించండి


  • దేవునితో గడిపే సమయములో ఈ విధముగా ఎప్పుడైనా మీరు వ్రాసుకున్నారా?
  • ఒక వచనమును ఎన్నుకొని పైన చెప్పబడిన పద్ధతి ప్రకారముగా దానిని గూర్చి వ్రాయండి.
  • ఈనాటి బైబిల్ ధ్యానము లేక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రత్యేక్షతను వ్రాసుకోండి
Day 2Day 4

About this Plan

Making Time To Rest

మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, వి...

More

ఈ బైబిల్ ప్రణాళికను రూపొందించి మీకందించిన వారు YouVersion.

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy