ప్రణాళిక సమాచారం

ఈస్టర్ ఎందుకు?నమూనా

Why Easter?

DAY 3 OF 5

వేటి నుండి స్వాతంత్రము?



మనము విడుదల పొందుటకు కావలసిన ప్రాయశ్చిత్తార్థ క్రయ ధనమును, యేసు ఆ సిలువపైన తన రక్తము ద్వారా భరించెను.



అపరాధభావము నుండి స్వాతంత్రము



ఎన్నోమార్లు మన యొక్క ఆలోచనలు, మాటలు మరియు క్రియలలో దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి నప్పుడు మనము వాటిని అపరాధముగా భావించినప్పటికి లేనప్పటికి, మనమందరము దేవుని యెదుట అపరాధులముగా ఉన్నాము. ఏ విధముగా అంటే ఎవరైనా ఒక నేరము చేసినప్పుడు ఆ శిక్షకు తప్పక పరిహారమును చెల్లింపవలయునో, అదే విధముగా దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కూడా దానికి ఒక పరిహారమును చెల్లింప వలసియుండును. 'ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము' (రోమా 6:23).



ఆ అపరాధముల యొక్క పర్యావసనమే నిత్యత్వమంతయు దేవుని నుండి యెడబాటు - అనగా ఆత్మీయ మరణము. మనమందరము ఆ శిక్షను పొందవలసిన వారమైయున్నాము. మనము పూర్తిగా క్షమించబడి, మన అపరాధమంతయు తుడుచి వేయబడు నిమిత్తం ఆ సిలువ మీద, మన స్థానమును యేసు తీసుకుని ఆ శిక్షంతటిని పొందెను.



వ్యసనము నుండి స్వాతంత్రము



'పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని' యేసు చెప్పెను. ఆ దాసత్వము నుండి మనలను విడిపించుటకే యేసు మరణమాయెను. ఆ సిలువ మీద, వ్యసనము యొక్క బలము పూర్తిగా విరిగిపోయెను. మనమింకను అనేకసార్లు మనము పాపములో పడునప్పటికీ, మనలను యేసు స్వతంత్రులుగా చేసినప్పుడు, వ్యసనము యొక్క బలము విరిగెను.



భయము నుండి స్వాతంత్రము



'ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును' (హెబ్రీ 2:14-15) యేసు వచ్చెను. కావున ఇకమీదట ఎంతమాత్రము మనము మరణమునకు భయపడము.



యేసు చేత స్వతంత్రులుగా చేయబడిన వారెవ్వరికి మరణము ఒక ముగింపు కాదు. అది పాపము యొక్క ప్రసన్నత నుండి కూడా మనలను విమోచించి పరలోకములో ప్రవేశించుటకు ద్వారమూలమై యున్నది. ఎప్పుడైతే యేసు మనలను మరణము యొక్క భయము నుండి విడిపించెనో, అప్పుడే మనలను సమస్త భయాల నుండి కూడా విమోచించెను.


Day 2Day 4

About this Plan

Why Easter?

ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఆల్ఫా మరియు నిక్కీ గుంబెల్ లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://alpha.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy