ప్రణాళిక సమాచారం

ఈస్టర్ ఎందుకు?నమూనా

Why Easter?

DAY 1 OF 5

అసలు యేసు మనకెందుకు కావాలి?



నీవు మరియు నేను దేవునితో ఒక సంబంధము కలిగి జీవించుటకు సృష్టించబడ్డాము. ఆ సంబంధమును కనుగోనెంత వరకు మన జీవితాలలో ఎప్పుడు ఎదో కోల్పోయినట్లుగానే ఉండును. దాని కారణముగానే, తరచుగా మనలో ఎదో ఒక లోటు కలదని మనము ఎరిగి యుంటాము. దానిని ఒక రాక్ గాయకుడు ఈ విధముగా తెలియజేసాడు: 'నా హృదయపు లోతుల్లో ఒక లోటును కలిగియున్నాను.'



ఒక స్త్రీ నాకు వ్రాసిన లేఖలో 'హృదయంతరంగములలోని లోటు' అని వ్రాసెను. ఇంకొక యువతి 'తన జీవితములో ఎదో కొల్పోతున్నాను' అని తెలియజేసెను.



మనుషులు ఆ లోటును అనేక విధముల చేత నింపుటకు ప్రయత్నిస్తుంటారు. కొంత మంది ఆ దానిని డబ్బుతో నింపుటకు ప్రయత్నించెను కాని, అది సంతృప్తి పరచబడలేదు. ప్రపంచములోని అత్యంత ధనవంతులలో ఒకడైన, అరిస్టాటిల్ ఒనాసిస్ అనే వ్యక్తి తన జీవితాంతములో: 'మనిషికి జీవితంలో నిజముగా కావలసిన దానికి కోట్ల సంపద ఎంతమాత్రము సరిపోదు' అని చెప్పెను.



కొంతమంది మాదకద్రవ్యాలు లేక అతి మద్యపానము లేక లైంగిక సంపర్కములను ప్రయత్నిస్తారు. ఒక యువతి నాతో ఇలా అనింది, 'ఇవన్ని కూడా అల్పకాల సంతోషాన్నిస్తాయి కాని తరువాత నిన్ను ఒంటరిని చేసి విడిచిపెడతాయి.' అయినప్పటకి ఇంకొంతమంది సంగీతం, క్రీడ లేదా కష్టపడి పని చేయడం లేక విజయాన్నే వెదుకుట వంటి వాటిని ప్రయత్నం చేస్తారు. వాటంత అవిగా ఏమి అవి తప్పు కాదు కాని, ప్రతి మానవునిలో ఉన్నతృష్ణను ఎంతమాత్రమును అవి తీర్చలేవు.



మానవుని అత్యంత సన్నిహిత సంబంధాలు ఎంతో అద్భుతమైనప్పటికి, ఈ 'లోతైన లోటును' అవి కూడా తీర్చలేవు. మనము ఎందు నిమిత్తమైతే నిర్మింపబడ్డామో ఆ దేవునితో సంబంధముతోటి కాక మరి దేనితోను అది నింపబడదు.



క్రొత్త నిబంధన ప్రకారముగా, స్త్రీ పురుషులు దేవునిని తిరస్కరించుటను బట్టియే ఈ లోటునకు కారణమాయెను.



'నేనే జీవాహారము' (యోహాను 6:35) అని యేసు చెప్పెను. ఆయన ఒక్కడు మాత్రమే, మన లోతైన తృష్ణను తీర్చగలడు ఎందుకనగా ఆయన ఒక్కని ద్వారా మాత్రమే దేవునితోటి మన సంబంధము తిరిగి సమకూర్చబడును.



a) జీవిత పరమార్థము మరియు ఉద్దేశ్యమునే దాహమును ఆయన తీర్చును.



కేవలము మన సృష్టికర్తతో సంబంధముతో మాత్రమే మన జీవితములకు గల నిజమైన అర్థమును మరియు ఉద్దేశ్యమును కనుగొనగలము.

b) మరణమును దాటి జీవమనే దాహమును ఆయన తీర్చును.



చాలా మంది అస్సలు చనిపోవాలని ఆశించరు. మనము మరణమును దాటి బ్రతకాలని కోరుకుంటాము. కేవలం యేసు క్రీస్తు నందు మాత్రమే మనము నిత్య జీవమును కనుగొనగలము.

c) క్షమాపణ అనే దాహమును ఆయన తీర్చును.



మనం నిజాయితీగా మాట్లాడుకుంటే, మనకి తప్పు అని తెలిసిన పనులను కూడా చేస్తామని మనమందరము అంగీకరించాలి. సిలువపై తన మరణం ద్వారా, మనము క్షమించబడుటకు మరియు దేవునితో తిరిగి సంబంధంలోకి తీసుకువచ్చుటకు యేసు మనకు మార్గమును ఏర్పరచెను.

వాక్యము

Day 2

About this Plan

Why Easter?

ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఆల్ఫా మరియు నిక్కీ గుంబెల్ లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://alpha.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy