ప్రణాళిక సమాచారం

నిబద్ధతనమూనా

నిబద్ధత

DAY 2 OF 3

నమ్మకమైన నిర్వాహకత్వంపట్ల నిబద్ధత

మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన వరాలను, సామర్థ్యాలను, వనరులను

శ్రద్ధతో మరియు అంతర్వివేకంతో నిర్వహించుకొనడం మన విధ్యుక్తధర్మం.

నమ్మకమైన నిర్వాహకత్వంపట్ల నిబద్ధత అంటే మన సమయాన్ని మన సామర్థ్యాలను

మన ఆర్థికవనరులను అన్నిటిని రాజును ఘనపర్చడంకొరకు ఆయన రాజ్యాన్ని వ్యాప్తి

చేయడంకొరకు మనఃపూర్వకంగా ఉపయోగించడం.

గృహనిర్వాహకత్వంయొక్క ప్రాముఖ్యత గురించి లేఖనాలలో పలు ఆదేశాలున్నాయి,

నమ్మకమైన మరియు వివేకం కలిగిన గృహనిర్వాహకత్వంయొక్క ప్రాముఖ్యతను తెలియ

జేసే ఉపమానాలను యేసు తానే స్వయంగా బోధించాడు (మత్తయి 25:14-30).

ఆ రాజుయొక్క పిల్లలుగా మన జీవితంలోని ప్రతి రంగంలోను ఆయనను ఘనపర్చి

మహిమపర్చడంకొరకు మనలోని విశేషమైన సామర్థ్యాలను మరియు నైపుణ్యాలను ఉప

యోగించడానికి మనం పిల్వబడ్డాం.

మన పనిలో మనం శ్రద్ధను శ్రేష్ఠత్వాన్ని చూపించాలి (1 పేతురు 4:10, కొలొస్స 3:23-

24, సామెతలు 3:27).

ఇంకా, మనం కలిగి ఉన్నవన్ని పూర్తిగా దేవునివని, అవసరతలలో ఉన్నవారికి

ఔదార్యంతో ఇవ్వాలని గుర్తిస్తూ, మన ఆర్థికవనరులపట్ల మనం నమ్మకంగా ఉండడానికి

పిల్వబడ్డాం.

నమ్మకమైన నిర్వాహకత్వంపట్ల మన నిబద్ధత భౌతికసంపదలపట్ల నిబద్ధతను

మించినది, ఇది మన చర్యలకు మన వైఖరులకు కూడ వర్తిస్తుంది.

మన నోటిమాటల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడంకొరకు, వ్యర్థమైన ముచ్చట్లకు

దూరంగా ఉండడంకొరకు, నెమ్మది మరియు ప్రశాంతత గల ఆత్మను హత్తుకొనడంకొరకు

మనం పిల్వబడ్డాం (సామెతలు 16:28, 1 థెస్సలొనీక 4:10-12).

మనం చేసేవాటన్నిటిని, మనం ప్రభువుకొరకు చేయడంకొరకు మన ఆరాధనకు యోగ్యు

డైన దేవునికి మన ప్రయత్నాలు ఉత్తమమైనవిగా ఉండేటట్టు చేయాలి.

నమ్మకమైన నిర్వాహకత్వంపట్ల మన అచంచలమైన నిబద్ధత ద్వారా, దేవుని

ఏర్పాటుపట్ల మన ప్రగాఢమైన భక్తిని మనం ప్రతిబింబిస్తాం, ఆయన బోధలపట్ల మన

విధేయతను వెల్లడి చేస్తాం, అంతిమంగా ఆయన నామానికి మహిమ తీసుకొని వస్తాం.

Day 1Day 3

About this Plan

నిబద్ధత

నిఘంటువు నిర్వచనం ప్రకారం నిబద్ధత అంటే, “ఏదైనా కారణంకొరకు, కార్యంకొరకు, లేదా సంబంధంకొరకు అంకితంచేసుకున్న స్థితి లేదా అంకితభావం.” క్రీస్తును వెంబడించే వారుగా మనం నిబద్ధత గల జీవితాలను జీవించడంకొరకు పిల్వబడ్డాం. దేవునితో ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy