ప్రణాళిక సమాచారం

ఆదేశంనమూనా

ఆదేశం

DAY 1 OF 3

వెళ్లాలనే ఆదేశం – అందరికొరకు అందరికి

“మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.” (మార్కు 16:15)

ప్రధాన ఆదేశంయొక్క లోతులలో మనం గంభీరమైన సత్యాన్ని తెలుసుకుంటాం – ఇది

కేవలం మనకు ఇవ్వబడిన ఆజ్ఞ మాత్రమే కాదు గాని స్వయంగా దేవునియొక్క అస్తిత్వంలో

స్వాభావికంగా ఉన్న నిత్యమైన ధర్మవిధి.

ఆదేశం, మౌలికంగా, దేవుని హృదయంయొక్క వ్యక్తీకరణ.

తండ్రి తన కుమారుడిని పంపించడంద్వారా ఈ ధర్మవిధిని ప్రారంభించాడు, పిమ్మట, తండ్రి

మరియు కుమారుడు పరిశుద్ధాత్మను పంపించారు. ఆయన మనల్ని పంపుతుండగా, విమో

చన మరియు ప్రేమ అనే ఈ దైవిక ఇతివృత్తంలో చేరడానికి ఇప్పుడు మనం ఆదేశించబడ్డాం.

కేవలం కొన్ని లేదా ఫలాని సమయాలను మాత్రమే ఎన్నుకొని ప్రధాన ఆదేశాన్ని పరిమితం

చేయడంలోని అపార్థాలను మనం తొలగించుదాం. ఈ ధర్మవిధి తమను తాము క్రీస్తు శిష్యు

లుగా చెప్పుకొనే అందరికి, అనగా దేవుని పిల్లలందరికి వర్తిస్తుంది.

మన నేపథ్యాలు, సామర్థ్యాలు, పరిమితులు ఎలా ఉన్నప్పటికి, భూమి మీద దేవుని

రాజ్యాన్ని వ్యాప్తిచేయడంలో మనలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన బాధ్యత ఉంది.

ఈ ఆదేశం సమీపించకుండా ఉండడానికి ఏ దేశం లేదా ఏ ప్రాంతం మినహాయింపు కాదు.

ఆశతో ఉన్న ప్రతి ఆత్మకు జవాబును, గాయపడిన ప్రతి హృదయానికి స్వస్థతను ఇస్తూ

పరివర్తన కలిగించే యేసుయొక్క ప్రేమకు మనం సాక్షులం.

ప్రతి దేశాన్ని సమీపిస్తూ, ప్రతి హృదయాన్ని స్పర్శిస్తూ కారుణ్యంతో మరియు దృఢచిత్తంతో

మనం యేసులో కనుగొన్న నిరీక్షణను ప్రకటిస్తున్నాం.

ఒక విషయం జ్ఞాపకం ఉంచుకొనండి, ప్రధాన ఆదేశం కేవలం ఒక సూచన కాదు గాని ఇది

దైవిక ఆజ్ఞ. లోకం వెలుగు కొరకు, స్వస్థతనిచ్చే ఆయనయొక్క స్పర్శ కొరకు, నమ్మదగిన

ఆయన ప్రేమకొరకు పరితపిస్తూ ఉంది. మనం అవశ్యంగా యేసును వారికి పరిచయం

చేయాలి. మన దర్శనం అవశ్యంగా సరిహద్దులకు ఆవల ప్రతి దేశానికి ప్రతి

ప్రజాసముదాయా నికి సత్యంపట్ల క్షుధతో ఉన్న ప్రతి హృదయానికి చేరువ కావాలి.

మనం లక్ష్యంతో ముందుకు వెళ్దాం, మన పరిచర్యయొక్క ధర్మవిధిని నెరవేర్చడంలో

దృఢంగా ఉందాం, మనకు అప్పగించబడిన పిలుపును నెరవేర్చుదాం.

వాక్యము

Day 2

About this Plan

ఆదేశం

“ఆదేశం” బైబిల్‌ ప్రణాళికకు స్వాగతం, ఇది క్రీస్తుయొక్క శిష్యులు వెళ్లి ఆయన ప్రేమను అందరికి తెలియజేయాలని ప్రతి శిష్యుడికి ఇవ్వబడిన దైవికమైన ధర్మవిధి యొక్క అన్వేషణ. ప్రధాన ఆదేశాన్ని దేవునినుండి వచ్చిన వ్యక్తిగత పిలుపుగా మ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy