ప్రణాళిక సమాచారం

దేవునికి మొదటి స్థానం ఇవ్వండినమూనా

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

DAY 2 OF 5

“దేవుడు ఆయన హృదయంలో నీకు మొదటి స్థానం ఇచ్చాడు”

నీవు ఎన్నడూ పాపం చేయనట్టే దేవుడు నిన్ను చూస్తున్నాడని ఎవరైనా నీకు చెబితే నీకు ఏమనిపిస్తుంది? వాస్తవం ఏమిటంటే, యేసు సిలువలో చేసిన విమోచనా కార్యము వలన, దేవుడు నిన్ను అలాగే చూస్తున్నాడు. క్రైస్తవులముగా మనం క్షమించబడ్డాము, శుద్ధులమై విడుదల పొందాము!

అంటే మీరు పరిశుద్ధులని అర్థం: క్రీస్తులో ఒక ప్రత్యేకమైన స్థానం మీరు పొందియున్నారు. మీరు దేవుని దృష్టిలో పరిపూర్ణులు, పరిశుద్ధులు మరియు నిందారహితులు. ఆయన మిమ్మును తన కుమారుడు/కుమార్తెగా, ఆయన సమృద్ధిలో వారసులుగా మరియు ఆయన స్నేహితులుగా పిలుస్తున్నాడు.

“అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” 1 పేతురు 2:9

దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనం ఆయనను చూసినప్పుడే మనకు నిజంగా అర్థమవుతుంది. మనం ఎప్పుడు తప్పుచేస్తే అప్పుడు మనల్ని శిక్షించటానికి దేవుడు దూరం నుండి కనిపెట్టి చూడటంలేదు. ఇంతకంటే మరొక సత్యం లేదు.

ఈ వచనం చెప్పే విషయాన్ని ఆలోచించండి:

“తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.” యోహాను 1:12-13

దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ తన విలువైన పిల్లలుగా చూస్తాడు. ఆయన ఒక ప్రేమ గల తండ్రిగా తన అంతులేని కరుణలోనుండి మనపై కృపను, శ్రద్ధను కుమ్మరిస్తాడు. మనపట్ల దేవునికున్న అమితమైన ప్రేమను భార్యభర్తల మధ్య ఉండే సన్నిహిత ప్రేమతో పోల్చుట ద్వారా పరమగీతముల గ్రంథంలోని కొన్ని వచనాలలో దేవుడు దానిని వివారిస్తున్నాడు. దేవుని వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని హెబ్రీ 11:6 చెబుతుంది.

మనలో చాలామంది తమ్మును తాము చూసుకునే దానికంటే పూర్తి భిన్నంగా దేవుడు ఆయన పిల్లల్లో ప్రతి ఒక్కరినీ చూస్తాడు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు చూసే విధానం మనం రక్షణ పొందిన క్షణంలో క్రీస్తు మన జీవితాల్లో ప్రారంభించిన కార్యం మీద ఆధారపడి ఉంటుంది.

“కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;” 2 కొరింథీయులకు 5:17

“ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.” 2 కొరింథీయులకు 5:21

ఈ నూతన సృష్టి దేవుని దైవిక కార్యం; మన ఆత్మీయ స్థితి మరియు అంతఃపురుషుని యొక్క సంపూర్ణ మార్పు. ఆయన మన గత, ప్రస్తుత మరియు భవిష్య పాపములనుండి సంపూర్ణంగా కడిగి మనలను శుద్ధి చేశాడు. మనం ఇప్పుడు ఆయనతో సరియైన సంబంధంలో ఉన్నాము.

“పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు.” కీర్తనలు 103:12

మనం ఆయనకు అందించబడిన పాపపు డాగు లేని దేవుని ప్రజలము; నిజముగా, యేసు సిలువలో చేసిన కార్యము ద్వారా ఆయన నీతిగా ఉన్నాము. దేవుడు నిజముగా ఆయన హృదయంలో మనకు ప్రధమ స్థానం ఇచ్చాడు!

Day 1Day 3

About this Plan

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy