ప్రణాళిక సమాచారం

మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!నమూనా

మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!

DAY 1 OF 6

“దేవుడు నిన్ను పరలోకంలోనికి రానివ్వవచ్చా?”

ఈ భూమి మీద మీ సమయం అనుకోకుండా ముగిసిపోయిందని ఒక్క క్షణం ఊహించుకోండి. మీ సృష్టికర్త ముందు పట్టలేనంత ఆశ్చర్యంతో మీరు నిలబడి ఉన్నారు. మీ తికమక మరియు ఆశ్చర్యం నిత్య గృహాన్ని చూడబోతున్నాననే ఎదురుచూపు మరియు ఉత్సాహముగా మారబోతున్న సమయంలో అకస్మాత్తుగా ఎవరో మిమ్మును అడ్డుకున్నారు. దేవుడు మీతో, “నేను నిన్ను పరలోకంలోనికి ఎందుకు రానివ్వాలి?” అనే గుచ్చుకుపోయే ప్రశ్న అడిగాడు.

నీవు ఎలా స్పందిస్తావు?

దేవుని దయవలన మనలో ప్రతి ఒక్కరికీ ఆ గొప్ప మరియు అద్భుతమైన రోజు వచ్చినప్పుడు, లోనికి వెళ్ళే ముందు ఒక పరీక్ష రాయమని దేవుడు మనకు చెప్పడు. అయితే, ఈ పరిస్థితి మనం రక్షణ గురించి మరింతగా అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన మరియు ఆలోచింపజేసే ఒక ముఖచిత్రాన్ని సూచిస్తుంది.

కొంతమంది తాము చేసిన మంచి పనుల గురించి చెబుతూ దేవునికి స్పందించవచ్చు. మరికొందరు తాము నమ్మకంగా సంఘారాధనలో పాల్గొంటున్నామని, ఇంకొందరు తమ జీవితంలో ఏయే చెడ్డపనులు చేయలేదో ఒక పట్టిక రాయవచ్చు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇవి కొన్ని ప్రముఖ్యమైన విషయాలే గాని అవి మనకు రక్షణ ప్రసాదించలేవు. ఈ ప్రశ్నకు ఒక్కటే సరియైన జవాబు ఉంది:

“యేసు క్రీస్తును నేను నా సొంత రక్షకునిగా అంగీకరించాను, మరియు ఆయన నా పాపములన్నిటిని కడిగివేశాడు.”

వాక్యము

Day 2

About this Plan

మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!

మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy