ప్రణాళిక సమాచారం

మీ అత్యుత్తమ పెట్టుబడి!నమూనా

మీ అత్యుత్తమ పెట్టుబడి!

DAY 3 OF 5

“బైబిల్ అనుదినం చదవండి”

మనం చదువుకోవటానికి బైబిల్ కావలసినంత సమాచారాన్ని కలిగి ఉందని మనలో చాలా మంది అంగీకరిస్తారు – అందులో కొంత కొన్నిసార్లు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు మరియు అస్పష్టత కలిగి ఉన్నట్లు మనకు అనిపించవచ్చు. మీ ధ్యాన సమయంలో ముందుకు ఎలా కొనసాగలో మీరు తెలుసుకొని దానిని మరింతగా అర్థం చేసువనటానికి మీకు సహాయపడి కొన్ని వాస్తవాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మొదటిగా, బైబిల్ రెండు వేర్వేరు భాగాలుగా విభజించబడటం మీరు చూస్తారు:

పాత నిబంధన లోకం యొక్క సృష్టితో ప్రారంభించబడి, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర – ఒక దేశముగా వారి ఓటమి, దాని ఫలితంగా వారి శత్రువుల చెరలో ఉండుట, చివరిగా, క్రీస్తు జననానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మరలా యెరూషలేమును స్వాధీనపరచుకొనుటకు వారు తిరిగి వచ్చుట వంటి సంగతులతో క్రోడీకరించబడింది. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రముగా కూడా ఉండేది.

క్రొత్త నిబంధన యేసు పుట్టక ముందు కొద్ది కాలములో జరిగిన సంగతులతో ప్రారంభమై, మన రక్షకునిగా ఆయన జీవితం, పరిచర్య, ఆయన మరణం, పునరుత్థానం, మరియు చివరికి ఆయన సంఘం స్థాపించబడి ప్రపంచమంతటా వ్యాపించుట గూర్చిన విషయాల సమాహారముగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో ప్రత్యక్షపరచబడినట్లుగా, కృప ద్వారా క్రీస్తులో ఉన్న విమోచన సంబంధమైన సమాచారం పాత నిబంధన నియమించిన ఆచారాలను నెరవేర్చి దానికి ప్రత్యామ్నాయంగా మారింది.

రెండవదిగా, సాధారణంగా మాట్లాడాలంటే, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో మనం మూడు రకాల రచనలు చూస్తాము:

చారిత్రక నివేదిక - నిజయమైన గాథలు మరియు ఆనాటి ప్రజలు మరియు ముఖ్య సంఘటనల గురించి ప్రాముఖ్యమైన అవలోకనం అందించే రచనలు.

ఉపదేశ రచనలు - ఎటువంటి చారిత్రక నేపధ్యం ఇవ్వకుండా, క్రైస్తవ జీవితంలోని అనేక కోణాలు, సంఘ పాలన మరియు వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలలో ఉపదేశము అందించే పుస్తకాలు మరియు వచనాలు.

స్ఫూర్తిదాయక రచనలు - పద్యభాగం, ప్రోత్సహించడానికి, బలపరచడానికి మరియు రచయిత భావోద్వేగాన్ని పాఠకులకు తెలుపుటకు తగిన వర్ణనాసహితమైన రచనలు.

యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు పరిచర్యకు సంబంధించి చారిత్రక నివేదిక అందించే క్రొత్త నిబంధన రచనలు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. ఈ నాలుగు పుస్తకాలను సువార్తలు అని కూడా అంటారు. అపొస్తలులకార్యములగ్రంథము క్రొత్త నిబంధనలో ఉన్న మరొక చారిత్రక గ్రంథము. అది యేసు మరణం మరియు పునరుత్థానం జరిగిన తర్వాత సంఘం స్థాపించబడిన మరియు విస్తరించిన సంగతులను కలిగి వుంటుంది.

ఉపదేశ రచనలను అందించే క్రొత్త నిబంధన పుస్తకాలు రోమీయులకు వ్రాసిన పత్రిక నుండి యూదా పత్రిక వరకు ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు మరియు క్రైస్తవులకు సంఘ నాయకుల చేత సలహాలు మరియు ఉపదేశాలు అందించబడిన వాస్తవిక ఉత్తరాలు.

స్ఫూర్తిదాయక రచనలకు పాత నిబంధనలోని కీర్తనల గ్రంథము ఒక చక్కటి ఉదాహరణ. దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి అనుదినం పెట్టుబడిగా పెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదలను వాగ్దానం చేసే ఒక కీర్తన క్రింద ఇవ్వబడింది.

“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.” కీర్తనలు 1:2-3

దేవుని వాక్యమనే విత్తనాన్ని మన జీవితంలో విత్తాలంటే, బైబిల్ చదవటాన్ని మన జీవితంలో ఒక దినచర్యగా మార్చుకోవాలి. దేవుని వాక్యమనే విత్తనం మీ జీవితంలో మొలకగా మారుతుండగా, ఆయన ఆశీర్వాదాలు మరింత తేటగా కనిపిస్తాయి. కరవు మరియు కష్టకాలంలో కూడా, మిమ్మును నడిపించటానికి కావలసిన శక్తిని మీరు పొందుకుంటారు.

వాక్యము

Day 2Day 4

About this Plan

మీ అత్యుత్తమ పెట్టుబడి!

ఆశీర్వాదకరమైన మరియు సమృద్ధియైన రాబడి పొందాలంటే సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు నూతన క్రైస్తవులైతే, దేవుని వాక్యం అనుదినం ధ్యానించడానికి మించిన గొప్ప పెట్టుబడి మరేది ఉండదు. మీరు చదువుకొనటానికి, దానిని అర్థం చేసుకొన...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy