ప్రణాళిక సమాచారం

మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా

మీకు ఒక ప్రార్థన ఉంది!

DAY 6 OF 6

“ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ప్రార్థనా జీవితానికి ఆరు తాళపు చెవులు – రెండవ భాగం”

4. మీ వ్యక్తిగత అవసరతలు మరియు ఆశలు దేవునికి తెలియజేయండి, మరియు వాటిని తీర్చమని ఆయనను అడగండి. “మా అనుదిన ఆహారము మాకు దయచేయుము...”

మీ పట్ల దేవునికున్న ప్రేమ బలమైనది మరియు అవధులు లేనిది మరియు షరతులు లేనిది, బైబిలులో తరచుగా ప్రేమ గల తండ్రి తన బిడ్డపై చూపే కరుణతో అది పోల్చబడుతుంది. తన బిడ్డ (అది మీరే) మాటలు వినాలను ఆయన ఆశిస్తున్నాడు; మీ జీవితం గురించి, నీ అవసరతలు మరియు ఆశల గురించి మీ మాటలు విని వాటిని తీర్చడానికి రావాలని ఆయన ఆశిస్తున్నాడు. మీ పట్ల ఉన్న ఆయన ప్రేమ మీరు ఊహించిన దానికంటే అధికంగా మిమ్మును దీవించాలని ఆశిస్తుంది.

5. మీ పాపములను క్షమించమని దేవుని కోరండి. అదే సమయంలో, మీ పట్ల తప్పు చేసినవారిని క్షమించడం మరిచిపోకండి. “మా యెడల అపరాధము చేసినవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి.”

మన పాపములను క్షమించమని దేవుని అడగటం అనేది మన పాపాలను మనం గుర్తించి వాటిని దేవుని వద్ద ఒప్పుకోవటం దగ్గర ప్రారంభమౌతుంది.

“మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” 1 యోహాను 1:9

దేవుడు మిమ్మల్ని క్షమించి మీ పాపములను కడిగివేశాడని మీరు నిశ్చయత కలిగి ఉండవచ్చు. ఆ క్షమాపణతో కూడా అపరాధ భావం నుండి విమోచన, అవమానం మరియు శిక్షావిధి తప్పించుకొనుట లభిస్తాయి.

అయితే, దేవుడు మనల్ని క్షమించినట్లే, మనపట్ల తప్పుగా ప్రవర్తించినవారిని కూడా మనం క్షమించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నుండి క్షమాపణ పొందటం మనకు విడుదల ఎలా ఇస్తుందో, ఇతరులను క్షమించుట కూడా అలాగే చేస్తుంది – కోపం, అసూయ మరియు పాత బాధలు మనల్ని ఇంకా బాధపెట్టే విధేయంగా ప్రవర్తించడం.

క్షమాపణ, దానిని పొందుకోవటం మరియు ఇవ్వటం, క్రీస్తులో స్వేచ్ఛ కలిగి జీవించటానికి పునాది వంటిది.

6. శోధనలు మరియు మేలుకరము కాని పరిస్థితులను తప్పించుకొనుటకు దేవుడు మీకు సహాయం చేసేటట్లు ప్రార్థన చేయండి. “... శోధనలో నుండి తప్పించి, దుష్టుని నుండి తప్పించుము.”

1 యోహాను 1:9లో చెప్పబడినట్లు దేవుడు మన పాపమంతటిని క్షమించి, ప్రతివిధమైన దుర్నీతి నుండి మనలను శుద్ధి చేశాడు కానీ, మనం ఈ పతనమైన లోకంలో జీవిస్తున్నాము కనుక ఇంకా శోధన ఎదుర్కుంటూనే ఉంటాము. ప్రభువు ప్రార్థనలోని ఈ భాగం, మనం దేవుడు మనకిచ్చే క్షమాపణ విషయంలో నిర్లిప్తత కలిగి దానికి విలువను ఇవ్వకుండా ఉండకూడదని, భవిష్యత్తులో పాపం చేయకుండా ఉండాలనే ఆలోచన కలిగి ఉండాలని మనకు తెలుపుతుంది. దేవుడు మనలను క్షమించుట ద్వారా పాపము యొక్క ఆత్మీయ శిక్షను తప్పిస్తాడు కానీ ఆయన పాపం వ లన వచ్చే హానికరమైన ఫలితాలను తొలగించడు. కాబట్టి, శోధన తప్పించుకొనటానికి దేవుని సహాయం కోసం ప్రార్థన చేయుట చాలా ప్రాముఖ్యమైన విషయం.

అనుదినం మీరు సంతోషంగా దేవునికి ఇవ్వగలిగిన సమయాన్ని దేవునికి ఇవ్వండి. ప్రతిరోజు ఇంత సమయం గడపాలని దేవుడు మనకు కోటా ఏమీ ఇవ్వటంలేదు. అంటేకాకుండా, మెలకువ కలిగి “కునుకు వేయకుండా” ఉండటం కొన్నిసార్లు సవాలితో కూడిన పని కావచ్చు. నిరుత్సాహపడవద్దు. ప్రార్థనలో మీ సమయాన్ని దేవునికి అర్పిస్తే మీరు ఆయన చేత దీవించబడతారని తెలుసుకోండి!

వాక్యము

Day 5

About this Plan

మీకు ఒక ప్రార్థన ఉంది!

శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy