ప్రణాళిక సమాచారం

విమోచననమూనా

విమోచన

DAY 6 OF 7

పరిశుద్ధాత్మ విమోచనను కొనసాగిస్తున్నాడు

యేసు భూమిమీద ఉన్నప్పుడు ఆయన ఎవరిరైనా తాకి స్వస్థపర్చిన ప్రతిసారీ లేదా ఆయన శక్తి మంతమైన సత్యాన్ని బోధించిన ప్రతిసారీ, ప్రజలలో మార్పు తీసుకొనివచ్చిన ప్రతి సారీ పరలోకాన్ని చాలా దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఆయన తన తండ్రి ప్రక్కర సముచితమైన స్థానం తీసుకొనడానికి పరలోకానికి ఆరోహణమైనప్పుడు తన అనుచరులలో ప్రతి ఒక్కరిలోను ఉండడంకొరకు ఆయన దేవత్వంలోని మూడవ వ్యక్తిని పంపించాడు. పరిశుద్ధాత్మ నూటికి నూరుశాతం దేవుడు. ఆయనకున్న పేర్లలో కొన్ని:పారకాలియో(తోడుగా వచ్చేవాడు), సత్యస్వరూపియైన ఆత్మ, సహాయకుడు, ఉత్తరవాది, ఆదరణకర్త,రుయాహ్‌(వాయువు). ప్రతి విశ్వాసిని దేవుని శక్తితో నింపడంకొరకు, మనం దేవునిగురించి ఎక్కువగా తెలుసుకొనడం కొరకు ఆయన పంపబడ్డాడు. ఆయన దేవునియొక్క ఆత్మ గనక, మనం దేవునియొక్క మనసును ఆయన హృదయాన్ని ఎక్కువగా తెలుసుకొనడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు శరీరంలో ఒకరికొరకు ఆశీర్వాదంగా ఉండడంకొరకు, సంఘం వెలుపల ఉన్నవారు మనద్వారా క్రీస్తును తెలుసుకొనేలా మనం ఫలించడంకొరకు ఆయన మనకు శక్తినిస్తాడు. లేఖనాల గురించి మనకు లోతైన అవగాహన నిచ్చేవాడు ఆయనే, మనం ఉత్తేజంతోను ఉద్దేశపూర్వకంగాను క్రీస్తులో నూతనజీవంతో జీవించడంకొరకు మనకు సహాయ పడేవాడు ఆయనే. మనం దైవభక్తితో జీవించడంకొరకు మనకు కావలసినవన్నీ ఇచ్చేవాడు ఆయనే, మనం దేవుడిని సంతోషపెట్టేవారుగా చేస్తూ ఆయనతో అన్యోన్యసహవాసంలోకి తీసుకొనివచ్చేవాడు ఆయనే. ఆయన ఎక్కడో ఉన్న ఆకాశవాసి కాదు. ఆయన శక్తిమంతుడు, గాలి మనకు కనిపించనట్లే మనకు తెలియని రీతిగానే ఆయన మన జీవితాలలో పరివర్తన కలిగిస్తాడు. ప్రతి అపవిత్రతను కడిగివేసి జీవాన్నిచ్చే శుద్ధజలం వంటివాడు ఆయన. బంగారంలోని మాలిన్యాలను శుద్ధిచేసి ఇదివరకు లేని గొప్ప విలువను అందాన్ని ఇచ్చే ఆగ్నివంటివాడు ఆయన. దినదినమూ శత్రువుయొక్క సంకెళ్లనుండి మనలను విడిపిస్తూ, కల్వరిలో యేసు మనకొరకు సాధించిన విజయంలో మనం జీవించడంకొరకు మనకు సహాయపడేవాడు ఆయన.

తలంపు:

పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు క్రైస్తవ జీవితం జీవించలేరు.

Day 5Day 7

About this Plan

విమోచన

మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్‌ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy