ప్రణాళిక సమాచారం

నియంత్రణ సంపాదించడంనమూనా

నియంత్రణ సంపాదించడం

DAY 2 OF 3

కోపాన్ని నిర్వహించడం

మరొక సందర్భంలో,సాయంకాలభోజన సమయంలో,ఒక స్త్రీ,తీవ్రమైన దుఖం, పశ్చాత్తాపంతో ప్రభువైనయేసు పాదాలను తన కన్నీటిధారతో తడిపి,ఆమె పొడవాటి జుట్టుతో తుడిచివేస్తుంది. ఈ చర్యలో తన పూర్తి సమర్పణ కనిపిస్తుంది. హత్తుకునేలా ఉన్న ఆమెలోతైన పశ్చాత్తాపం వాక్యంలో అన్ని సమయాలకూ ఆమెకు గౌరవప్రదమైన ప్రస్తావనను సంపాదించింది. ప్రభువైన యేసు స్థానంలో ఎవరైనా ఉంటే బహిరంగంగా అమె కనుపరచిన భక్తి, శ్రద్ధల విషయంలో వారు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు లేదా కలవరపడేవారు. “ఒహో ఇది చాలా గొప్ప విషయం! అది కూడా ఈ పెద్ద మనుషులూ, స్నేహితుల ముందు, చానెల్ నంబర్5ద్వారా అందరూ గమనించారని తలస్తున్నాను, వాస్తవానికి అవి నిజమైన కన్నీరు.” అని ఒకరు తలంచియుండవచ్చు. మరొకవిధంగా లోలోపల భయపడుతూ“ఓహ్,లేదు,ఈ ప్రజలందరి ముందు కాదు! తన జుట్టును వదులుగా చేసుకొని, ఈ స్త్రీ నా పాదాలను ముద్దాడడం చూస్తే నన్ను చేర్చుకొన్న పరిసయ్యుడైన పాస్టర్ సీమోను గారు ఏమనుకొంటాడు? ప్రతి ఒక్కరూ ఇప్పటికే నన్ను అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఎంత భయంకరం!”అని మరొకరు అనుకోవచ్చును. అయితే ప్రభువైనయేసు సున్నితమైన, శ్రద్ధగల ప్రతిచర్య సీమోను కళ్ళు తెరపించడమే కాక,ఆ స్త్రీచేసిన పాపాలన్నిటినుండీ ఆమెకు విముక్తి కలిగించింది. లూకా7:36-38వచనభాగంలోదీనిని గురించి మరింత తెలుసుకోండి. ప్రభువైన యేసు తనకు తాను ఒక పర్వత శిఖరానికి వెళ్ళేంతవరకూ ఆయన నెమ్మదినీ, సమాధానాన్నీ పొందడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనను తాకుతారు, ముందుకు తోస్తారు, ఆయన చుట్టూ చేరతారు, ఆయన్ను కుదుపుతారు. ఆయన ఒక సాధారణ వ్యక్తిలా సముద్ర తీరంలో నడవలేడు, మనుషులు ఆయన మీద పడకుండా ఉండటానికి ఒక పడవలో ఎక్కవలసి వచ్చింది. ఆయన అన్ని రకాల ప్రజలతో కలిసిపోయాడు. ఎవరినీ తిరస్కరించలేదు,ప్రతిఒక్కరినీఆహ్వానించాడు,అవిశ్రాంతంగా పనిచేశాడు,ఎడతెగకుండామాట్లాడాడు.వాస్తవానికి,ఆయనసహనం ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో పరీక్షించబడింది. అయితే పాదరసస్థాయి (ఆవేశం) పెరిగినప్పుడు,ఆయననియంత్రణలను సర్దుబాటు చేశాడు. మంచి వ్యూహం. ఆయన సహనంగల దేవుడు. ఆయన కోపంగా ఉన్న అరుదైన సందర్భాలలో,అది నీతియుక్తమైనకోపంగా ఉంది,ఇది మన మేలు కోసం ఉద్దేశించబడింది. ఆయన వాక్కు విత్తనం మన ఆత్మల మంచి నేలలో పడినప్పుడు మనం కూడా మన తోటిపురుషులకూ లేదా స్త్రీలకూ జాలి,సహనం, కృప కనుపరచగల్గుతాము. మీకై మీరు బయటికి రండి. ఒక కీర్తన చదవండి. ఆత్మ ఫలాలను చూపించండి.

వాక్యము

Day 1Day 3

About this Plan

నియంత్రణ సంపాదించడం

మనం ఒత్తిడికి గురైనప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మనం ఆత్మ ఫలాలను కనుపరుస్తామా, లేదా మన మామిడి చెట్లు చేదు ఫలాలను, మన ద్రాక్షవల్లి పుల్లని ద్రాక్షలను ఉత్పత్తి చేస్తాయా? పాదరసం స్థాయి పెరిగినప్పుడు, మన కోపాలు వేగవంతం ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy