ప్రణాళిక సమాచారం

పిల్లలు కోసం బైబిలునమూనా

పిల్లలు కోసం బైబిలు

DAY 4 OF 8




చాలా కాలం క్రితం, దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను మేరీ అనే మధురమైన యూదు యువతి వద్దకు పంపెను. అతను ఆమెతో, "నీవు ఒక కొమారుడిని కందువు, ఆయనికి యేసు అని పేరు పెట్టుము. ఆయన సర్వోన్నతుడైన కుమారుడు అని పిలువబడతాడు. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు" అని చెప్పెను.

ఇది ఎలా సాధ్యము?" అని ఆశ్చర్యముతో ఆ అమ్మాయి అడిగింది. "నేను ఏ పురుషునితో కలవలేదు." ఆ బిడ్డ దేవుని నుండి వచ్చును అని దూత మరియతో చెప్పెను. మానవ తండ్రి ఆయనకు ఉండరు.

అప్పుడు ఆ దేవదూత మరియతో ఆమె బంధువు ఎలీసబెతు వృద్ధాప్యంలో ఒక బిడ్డను కలిగి ఉందని చెప్పెను. ఇది కూడా ఒక అద్భుతం. వెంటనే, మరియ ఎలీసబెతు ను సందర్శించింది. వారు కలిసి దేవుణ్ణి స్తుతించారు.

యోసేపు అనే ఒక వ్యక్తితో వివాహం కోసం మరియ ప్రధాన చేయబడెనున. మరియ ఒక బిడ్డకు పుట్టబోతుంనాడు అని తెలుసుకున్న యోసేపు విచారముతోఉండెను. అతను ఆ పుట్టబోవు బిడ్డకు తండ్రి వేరు అని అనుకున్నాడు.

ఒక స్వప్నమందు, దేవుని దూత యేసేపుకు ఆ పుట్టబోవు బిడ్డ దేవుని కుమారుడు అని చెప్పి మరియ యేసు చూసుకోనుటకు సహాయం చేయమని చెప్పెను.

యోసేపు దేవునిని నమ్మి మరియు విధేయత చూపాడు. అతను తన దేశ ధర్మశాస్త్రమునకు విధేయత చెప్పెను. కొత్త ధర్మశాస్త్రము కారణంగా, అతను మరియు మరియ తమ పన్నులు చెల్లించడానికి వారి స్వస్థలమైన బెత్లెహేకు వెళ్ళెను.

మరియ తన బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది. కానీ యోసేపుకు ఎక్కడా గది దొరకలేదు. సత్రాలన్నీ నిండి ఉన్నాయి.

చివరికి యోసేపు ఒక పశువుల పాకను కనుగొనెను. అక్కడ యేసు శిశువు జన్మించెను.అతని తల్లి అతన్ని పశువుల తొట్టిలో పరుండ పెట్టెను, అది సాధారణంగా జంతువుల ఆహారాన్ని పెట్టే ప్రదేశం.

సమీపంలో, గొర్రెల కాపరులు నిద్రిస్తున్న తమ మందలను కాపలా కాస్తున్నారు. దేవుని దూత ప్రత్యక్షమై వారికి అద్భుతమైన వార్త చెప్పింది. దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు తొట్టిలో పండుకొనియుండ మీరు కనుగొంటారు."

అకస్మాత్తుగా, మరెన్నో ప్రకాశవంతమైన దేవదూతలు కనిపించి, దేవుణ్ణి స్తుతిస్తూ, “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!”.

గొర్రెల కాపరులు తొందరుగా ఆ స్థలమునకు వెళ్ళి. శిశువును చూసిన తర్వాత, దేవదూతలు యేసు గురించి ఏమి చెప్పిన మాటలు ప్రతి ప్రచారం చేశారు.

నలభై రోజుల తర్వాత, యోసేపు మరియు మరియ యెరూషలేములోని ఆలయానికి యేసును తీసుకువచ్చారు. అక్కడ సుమెయోను అనే వ్యక్తి శిశువు బట్టి దేవుని ని స్తుతించెను, అప్పుడు వృద్దురాలైన అన్నామరొక దేవుని సేవకురాలు దేవునికి కృతజ్ఞతలు చెలించెను.

యేసు దేవుని కుమారుడని, వాగ్దానం చేయబడిన రక్షకుడని ఇద్దరికీ తెలుసు. యోసేపు రెండు పక్షులను బలి ఇచ్చాడు. పేదలు ప్రజలు పుట్టిన శిశువును దేవునికి సమర్పించేటప్పుడు తప్పని సరిగా బలి అర్పించాలి అని దేవుని ధర్మశాస్తం చెప్పెను.

కొంత సమయం తర్వాత, ఒక ప్రత్యేక నక్షత్రం జ్ఞానులను తూర్పు దేశం నుండి యెరూషలేమునకు నడిపించెను. "యూదుల రాజుగా జన్మించిన వాడు ఆయన ఎక్కడ ఉన్నాడు?" వారు అడిగెను. "మేము ఆయనను పూజించవచ్చితిమి."

హేరోదు రాజు జ్ఞానుల గురించి విన్నాడు. కలవరపడి, యేసును కనుగొన్నప్పుడు చెప్పమని వారిని అడిగాడు. "నేను కూడా వచ్చిఆయనను పూజించుదునని" అని హేరోదు చెప్పెను. కానీ అతను అబద్ధం చెప్పాడు. హేరోదు యేసును చంపాలనుకున్నాడు.

చిన్న శిశువుతో యోసేపు మరియు మరియ కచ్చితముగా ఏ ఇంటిలో ఉన్నారో అక్కడకి జ్ఞానులను నక్షత్రం నడిపించింది. ఆరాధనలో మోకరించి, ఆ ప్రయాణికులు యేసుకు బంగారం మరియు పరిమళ ద్రవ్యాలను బహుమానంగా ఇచ్చారు.

దేవుడు రహస్యంగా ఇంటికి తిరిగి వెళ్ళమని జ్ఞానులను హెచ్చరించెను. హేరోదుకు కోపం వచ్చింది. యేసును చంపుటకు సంకల్పించుకొని, ఆ దుష్ట పాలకుడు బేత్లెహేములోని మగ శిశువులందరినీ చంపేశాడు.

కానీ హేరోదు దేవుని కుమారునికి ఏ హాని చేయలేకపోయెను! కలలో హెచ్చరించిన దాని ప్రకారం యోసేపు మరియు మరియ యేసును ఈజిప్టులో సురక్షితంగా తీసుకువెళ్ళెను.

హేరోదు చనిపోయినప్పుడు యోసేపు ఈజిప్ట్ నుండి మరియ మరియు యేసును తిరిగి వెనకకు తీసుకువచ్చెను. వారు గలిలయ సముద్రానికి సమీపంలో ఉన్న నజరేతు అనే చిన్న పట్టణంలో నివసించారు.

ముగింపు

వాక్యము

Day 3Day 5

About this Plan

పిల్లలు కోసం బైబిలు

అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy