ప్రణాళిక సమాచారం

మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుటనమూనా

మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుట

DAY 4 OF 5

సాధారణములో మహిమ

యోసేపు మరియు మరియ వివాహం మరియు గృహనిర్మాణం విషయంలో వారు చిన్నవారు మరియు అనుభవం లేనివారు అయినప్పటికీ వారు ఒకరినొకరు సన్నిహితం కాక ముందే సంతాన సాఫల్యత కోసం ఎంపిక చేయబడ్డారు. వారు ఒక సాధారణ బిడ్డకు తల్లిదండ్రులు కాదు,దేవుని కుమారునికే తల్లిదండ్రులు అయ్యారు.ఒత్తిడి గురించి మాట్లాడండి! మనం లూకా2వ అధ్యాయం చదివినప్పుడు,దేశవ్యాప్త జనాభా గణనలో భాగంగా నమోదు చేయబడుటకు వారు మరొక నగరానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి జీవితంలోని మరొక రోజు వివరాలను మనం చూస్తాము.

మరియ యొక్క గడువు తేదీకి దగ్గరగా వారు ప్రయాణించవలసి వచ్చింది మరియు బేత్లెహేములో జంతువుల కోసం ఉద్దేశించిన పశువులశాలలో బిడ్డను ప్రసవించింది. దేవుడు ఉద్దేశపూర్వకంగా తన అద్వితీయకుమారుడు అత్యంత సాధారణ ఏర్పాటులలో జన్మించడం కోసం చరిత్రను ఈ విధంగా ఆదేశించడం మనోహరమైనది. మరియ తనకు నూతనంగా జన్మించిన శిశువును గుడ్డ పేలికలలో చుట్టి,సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. జంతువులు యొక్క అననుకూల శబ్దములు,పశువులశాల దుర్గంధం మరియు ప్రకృతి యొక్క మూలకాలను కొంత మేర బహిర్గతం చెయ్యబడ్డారు.

ఇటీవలి కాలంలో దూరదర్శిని మరియు సామాజిక ప్రసార మాధ్యమం రావడంతో మనము అసాధారణమైన,నిష్ణాతులైన మరియు విజయవంతమైన జీవితాలను గడపడానికి అటువంటి ఒత్తిడిలో ఉన్నాము. మన ముఖాలు పరిపూర్ణంగా కనిపించాలని,ఉత్తమంగా సరిపోయే దుస్తులను కలిగి ఉండాలని,గొప్ప వేడుకలను నిర్వహించాలని మరియు మన చుట్టూ ఉన్న వారితో సన్నిహితంగా ఉండటానికి గొప్ప విహారయాత్రలను ప్రణాళికచేయాలని మనము కోరుకుంటున్నాము. సాధారణనువిసుగు అని మనము అనుకుంటాము. మనము లౌకికము మార్పులేనిది అని అనుకుంటాము.

మన సాధారణ జీవితాలకే యేసు యొక్క జోక్యం అవసరమని మనం మరచిపోతాము. భూలోకములో లభించే ఆనందమును మనము తగ్గిస్తాము.

రోమా​​​​12వచనం1చెపుతోంది“కాబట్టి ఇక్కడ నేను మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నాను,దేవుడు మీకు సహాయం చేస్తాడు: మీ రోజువారీ,సాధారణ జీవితాన్ని తీసుకోండి-మీ నిద్ర,తినడం,పనికి వెళ్ళడం మరియు జీవితం చుట్టూ నడవడం-మరియు దానిని దేవుని ముందు ఒక అర్పణగా ఉంచండి. దేవుడు మీ కోసం ఏమి చేస్తాడో ఆలింగనం చేసుకోవడం మీరు ఆయన కోసం చేయగలిగిన ఉత్తమమైన పని.

మీరు అన్నింటినీ యేసుకు సమర్పించుకొన్నప్పుడు మీరు మీ సాధారణ జీవితాన్ని గొప్ప ఉద్దేశ్యముతో జీవించవచ్చు. ఇది చేయడం ద్వారా,మీరు ఆయనకు అనంతమైన మహిమను తెస్తారు.

ప్రకటన: యేసు- నా జీవితం నీది. దానిలోని ప్రతి భాగం నీదే. మీరు దాని నుండి ఉత్తమమైన వాటిని తీసుకువస్తారని నాకు తెలుసు.

వాక్యము

Day 3Day 5

About this Plan

మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుట

దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలి...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy