ప్రణాళిక సమాచారం

లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

DAY 5 OF 7

సంపూర్ణ స్వస్థత

దేవుడు మనలను స్వస్థపరచువాడు అని చెప్పినప్పుడు,మన విషయంమలో ప్రతీ దానినీ ఆయన స్వస్థపరుస్తాడని అర్థం. అవును,ఆయన మనలను శారీరకంగా స్వస్థపరచడంలో శ్రద్ధ చూపించడం మాత్రమే కాకుండా మానసికంగానూ మరియు ఆత్మీయంగానూ పునరుద్ధరిస్తాడు. దయ్యాలు పట్టిన వారిని లేదా బలహీనతకు కారణమైన అపవిత్రాత్మలచే బందీలుగా ఉన్నవారిని స్వస్థపరిచినప్పుడు యేసు ఆ పని చేశాడు.

మనం భయముతోనూ, ఆశ్చర్యముతోనూ తయారు చెయ్యబడ్డామని దేవుని వాక్యం చెపుతుంది. న్యూ లివింగ్ అనువాదం బైబిలు ‘అద్భుతమైన సంక్లిష్టత’తో చెయ్యబడ్డామని చెపుతుంది. ఈ సంక్లిష్టతకు కారణం, మనం కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మతోనూ మరియు శరీరంతో కూడిన ఆత్మ జీవులం.

వీటన్నింటిని స్వస్థపరచడానికి ప్రభువైన యేసు ఆసక్తిని కలిగి ఉన్నాడు- విరిగి నలిగిన మన ఆత్మలు,గాయపడిన మన దేహాలు. అవి ఒకదానికొకటి అంతర్లీనంగా అనుసంధానించబడి ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాననీ, మరియు మన గాయాలన్నింటినీ స్వస్థపరుస్తాననీ దేవుడు యిర్మియా 30:17లో చెప్పినప్పుడు మనకు కొన్నిసార్లు మనకు తెలియని లోతైన గాయాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అని గుర్తించాలి.

ఈ గాయాలు బాల్య దుర్వినియోగం,తృణీకరించబడడం, నిర్లక్ష్యం,తిరస్కరణ,హింస,తీర్చబడని కోరికలు మరియు కోల్పోవడం మొదలైన వాటి నుండి సంభవించి ఉండవచ్చు.

ఇతర గాయాలు స్వయంకృతాపరాధం నుండి సంభవించి ఉండవచ్చు మరియు కనిపించని గాయాలు మరియు దాచిన నిరాశ యొక్క ఆ చిక్కులను సరిచెయ్యడం ఎక్కడ ప్రారంభించాలో మీకు తెలియదు.

గాయపడిన వ్యక్తులు స్పృహలో ఉండి లేదా స్పృహలో లేకుండా కూడా ఇతర వ్యక్తులను గాయపరుస్తారు. దేవుడు నిన్ను స్వస్థపరచాలనీ, నిన్ను పునరుద్ధరిస్తాడనీ కోరుతున్నాడు, తద్వారా నువ్వు ఇతరులను స్వస్థపరచగలవు, పునరుద్ధరించగలవు. పరిశుద్ధాత్మను గ్రీకు భాషలో పారక్లెటోస్ అని పిలుస్తారు. అంటే సహాయం చేయడానికి పక్కకు వచ్చేవాడు. లోతైన గాయాలను బహిర్గతం చేయడానికీ మరియు వాటిని పునరుద్ధరించడానికి సహాయపడే సలహాదారుడు. పునర్జీవింపజేసే కార్యానికి ఆయన కర్త. మరియు నిజంగా స్వస్థత పొందడానికి మనం ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఈరోజు ఆవిధంగా చేస్తారా?

Day 4Day 6

About this Plan

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందా...

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:  https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy