ప్రణాళిక సమాచారం

సంక్షోభ సమయంలో దేవుని మాట వినడంనమూనా

సంక్షోభ సమయంలో దేవుని మాట వినడం

DAY 4 OF 4

పరిశుద్ధాత్మ మీద ఆధారపడడానికి పిలుపు

దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన కార్యకలాపం. మనలను స్వస్థపరచుటకు, మనలను నడిపించుటకు, మనలను బలపరచుటకు, మనలను ఒప్పించుటకు మరియు మనలను శక్తివంతం చేసేందుకు ఆయన తన ఆత్మను మనకు ఇచ్చాడు. మనకు అన్నిటి కంటే మన జీవితంలో దేవుని సన్నిధి చాలా అవసరం. అయితే దేవుని సన్నిధిని మనం ఎక్కడ కనుగొనగలం?

ప్రభువైన యేసును నేను సంధించినప్పుడు, నేను పరిశుద్ధాత్మను అనుభవించాను. దేవుని ఆత్మ నా జీవితాన్ని మార్చింది మరియు నాకు నూతన ఆనందాన్ని, అలాగే మనుష్యుల కోసం సమాధానాన్నిమరియు ప్రేమను ఇచ్చింది.

పరిచర్య మరియు సువార్త ప్రచారానికి దేవుని ఆత్మ మీద నిరంతర ఆధారపడటం చాలా అవసరం-ఎందుకంటే ప్రభువైన యేసు యొక్క పరిచర్య అనేది మన స్వంత శక్తితో కాకుండా ఆయన శక్తితో మనం చేయవలసి ఉంటుంది.

ప్రభువైన యేసు ఒక బండగా ఉన్నాడు, దీని మీద సంఘం నిర్మించబడింది. ఈ సంఘానికి కేంద్రం ప్రభువైన యేసు. సంఘం ప్రభువైవైన యేసు శరీరం. మనం ఆరాధనలో యేసును కలుగొంటాము, మరియు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కొంటాము. మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆయనను ఎదుర్కొంటాము––ఆయన లేఖనాల ద్వారా మాట్లాడతాడు. మనం సంఘంగా కలిసి వచ్చినప్పుడు కూడా యేసును కూడా ఎదుర్కొంటాము, అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం యేసును నేరుగా ఎదుర్కోగలము.

నాకు ఇష్టమైన ప్రార్థనలలో ఒకటి సరళమైన, మూడు పదాల ప్రార్థన: ‘పరిశుద్ధ ఆత్మ రమ్ము’ హెచ్.బి.టిలో ప్రతీ ఆరాధనలో ఈ ప్రార్థన చెయ్యడానికి మాకు సమయం ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రార్థన––కేవలం మూడు పదాలు––అయితే అది చాలా శక్తివంతమైనది.

పరిశుద్ధాత్మ శక్తిని మీరు ఎలా అనుభవించారు? ఆయన శక్తి, స్వస్థత మరియు ప్రోత్సాహం ఎక్కడ ఈ రోజు మీకు అవసరం? మీ జీవితంలోని ప్రతి అంశానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి మరియు ఆయన శక్తి మీద ఆధారపడండి.

నిక్కీ మరియు పిప్పా గుంబెల్‌లచే నిర్వహించబడిన నాయకత్వపు సదస్సు, దేవుని యొక్క ఒక ప్రపంచ కుటుంబంగా ఐక్యతతో కలిసివచ్చే అవకాశం. ప్రభువైన యేసును కలుసుకొనేందుకు, పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో మన భాద్యతను పోషించే శక్తిని పొందేందుకు ఒక ప్రదేశం. మరింత తెలుసుకోవడానికి, సందర్శించండి

https://www.leadershipconference.org.uk/

వాక్యము

Day 3

About this Plan

సంక్షోభ సమయంలో దేవుని మాట వినడం

మీరు దేవుని స్వరాన్ని ఎలా వింటారు? ప్రపంచ వ్యాపిత సంక్షోభ సమయాలలో దేవుడు ఏమి చెపుతున్నాడు? ఈ 4-రోజుల ప్రణాళికలో, ఆల్ఫా సంస్థ వ్యవస్థాపకుడు నిక్కీ గుంబెల్ దేవుని స్వరాన్ని వినడానికి సహాయపడే కొన్ని సాధారణ అభ్యాసాలను పంచుకో...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము ఆల్ఫాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.leadershipconference.org.uk/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy