ప్రణాళిక సమాచారం

ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడంనమూనా

ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడం

DAY 5 OF 5

మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా?




ఈ మూడు రకాల ప్రార్థనలను ఆచరణాత్మకంగా చూడడంలో ఉత్తమ మార్గం, ప్రభువైన యేసు స్వయంగా ప్రార్థించిన కొన్ని ప్రార్థనలను చూడడమే. ఆయన సిలువకు వెళ్ళేటప్పుడు గెత్సెమనే తోట వద్ద ప్రార్థన చేసాడు, సిలువమీద వేలాడుతున్నప్పుడు ప్రార్థించాడు. గెత్సెమనే తోట వద్ద, ఆయన ఒక కీలకమైన (ఇరుసు) ప్రార్థన చేసాడు, అక్కడ ఆయన తన దుఃఖాన్ని వ్యక్తపరచాడు, అయితే ఇంకా దేవుని చిత్తాన్ని నెరవేర్చబడాలని ప్రార్థించాడు. ఇదే ప్రార్థన నిరంతర పట్టుదల ప్రార్థనగా ఉంది, ఎందుకంటే ఆయన దానిని మూడుసార్లు అవే మాటలతో పునరావృతం చేశాడు.




ప్రభువైన యేసు సిలువ మీద వేలాడుతున్నప్పుడు చనిపోతున్న సమయంలో ఆయన తన ప్రవచనాత్మక ప్రార్థన గట్టి స్వరంతో పలికాడు. తన చుట్టూ వినే వారందరి ప్రయోజనం కోసం ఆయన లోకం యొక్క పాపాన్ని మోయడంలోనూ, పాపులతో తనను తాను ఐక్యపరచుకోవడంలోనూ – ఆయన తండ్రితో సంబంధాన్ని కోల్పోయాడు. ఇది ఉద్రేకపూరితమైనది కాదు, స్వీయ జాలి కాదు, లేదా మూలుగు కాదు, అయితే ఉద్దేశంతో కూడిన శక్తివంతమైన ప్రకటన




మీరు ప్రార్థన చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు?


దేవుని గురించి మరింత తెలుసుకోవటానికి మీరు ఆయనతో సహవాసం కొనసాగించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు?


ఆయన చిత్తానికి అనుగుణంగా సమస్తము కోసం, ప్రతీ దానికోసమా ప్రార్థిస్తున్నారా?


మీ ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి యున్నారా. ఇరుసు ప్రార్థన చేస్తున్నారా, ప్రవచనాత్మక ప్రార్థన చేస్తున్నారా?




మీరు ఈ బైబిల్ ప్రణాళికను చదువుతున్నప్పుడు, పట్టుదల, ఇరుసు, ప్రవచనాత్మక ప్రార్థన చెయ్యడానికి సులభమైన మార్గాలలో ఒకటి - ఈ బైబిలు యాప్ లో ఉన్న ప్రార్థన లక్షణాలను ఉపయోగించడం.




1. ఆ పురోగతిని మీరు చూసేవరకు పట్టుదలతో ప్రార్థన చేయడానికి జ్ఞాపికలను సిద్ధం చేసుకోండి. అన్ని సమయాలలోనూ, అన్ని కాలాల్లోనూ ప్రార్థన చేసే అలవాటును ఇది పెంచుతుంది. ⏰


2. పురోగతిని చూడటానికి మీరు ఒంటరిగా ప్రార్థించడంలో మీరు కష్టపడుతున్నట్లయితే నమ్మదగిన స్నేహితుడిని గానీ లేదా కుటుంబ సభ్యుడిని గానీ కలుపుకోండి, ఇరుసు ప్రార్థన చేయండి. మీరు ఇతరులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఒకరినొకరు బలపరచుకొంటారు, ఎక్కువ ప్రదేశాన్ని పొందుతారు. 👥


3. ప్రతిరోజూ మీకు పరిచర్య చేసే వచనాలను నమోదు చేసి వాటిని ప్రార్థనగా చేర్చండి. ప్రార్థన చేయడానికి ఉత్తమ మార్గం - లేఖనాలను ఎత్తి పట్టడమే, మీ పరిస్థితిమీద ప్రకటించడమే.  📝



Day 4

About this Plan

ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడం

మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహా...

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy