ప్రణాళిక సమాచారం

నిజమైన ఆధ్యాత్మికతనమూనా

నిజమైన ఆధ్యాత్మికత

DAY 7 OF 7

మీ ప్రయాణాన్ని కొనసాగించడం


దీనిని మీకు తెలియపరచడం నాకు ఇష్టం లేదు, అయితే మీరు ఈ జీవితంలో పరిపూర్ణంగా ఉండరు. బహుశా మీకు ఇది ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. ప్రభువైన క్రీస్తులో మీరు ఎంతగా రూపాంతరం చెందుతున్నప్పటికీ, మీరు ఆయనను ముఖాముఖిగా చూసే దినం వరకూ మీరు పురోగతిలో ఉన్న కార్యంగా ఉన్నారు.


శుభవార్త ఏమిటంటే, దేవుడు మిమ్మును ఆశీర్వదించి, మీ ఎదుగుదలను శక్తితో నింపాలనేదే దేవుని తీవ్రమైన ఆకాంక్ష. తద్వారా మీరు ప్రభువైన రమ్యతనూ, ప్రేమనూ, పరిశుద్ధతనూ మరింతగా ప్రతిబింబించ గలరు.


ఆయన మంచితనం, పరిపూర్ణత మీకు ఆనందాన్ని కలిగించడమే కాదు. ఇది ఆయన కృపనూ, జ్ఞానాన్నీ, ప్రేమనూ శక్తినీ లోకానికి వెల్లడి చేస్తుంది. ఆయనతో ఉన్న సంబంధంలో మీ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చివరికి నెరవేరుతుందనీ, రాబోతున్న రోజులలో నెరవేరుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు.


మీరు జాగ్రత్తగా జరిగించడానికి పిలువబడిన దశలను జ్ఞాపకం ఉంచుకోండి:


·  మీరు సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవాలి – కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, ప్రతిరోజూ సమర్పించుకోవాలి.


·  మీరు ఈ లోక విలువలూ, దాని విధానాలకూ భిన్నంగా జీవించాలి.


·  మిమ్మల్ని మీరు ఖచ్చితంగా చూడటం నేర్చుకోండి – అహంకారంతో గానీ లేదా తప్పుడు వినయంతో గానీ కాదు అయితే దేవుడు చేసినట్లు చెయ్యండి.


·  మీరు ఇతర విశ్వాసులకు ప్రేమలో సేవ చెయ్యండి.


·  దుష్టత్వాన్ని ఎదుర్కొంటున్న సమయంలో దైవికమైన ప్రేమతో మీరు స్పందించండి. మేలుతో దానిని అధిగమించండి.


 


ప్రతిరోజూ దేవునితో మీ సంబంధాన్ని ఈ దశలు చూపించగలిగినట్లయితే, మీరు దేవుణ్ణి ఘనపరచేదీ, ఇతరులను ప్రభావితం చేసేదీ అయిన ప్రామాణిక క్రైస్తవ జీవితాన్ని మీరు జీవిస్తారు. 


ఇది వాగ్దానం – నా నుండి కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన లేఖనాల ద్వారా దేవుని నుండి వచ్చిన వాగ్దానం. జీవితంలోని ప్రతి అంశంలోనూ అనుదినం ఆయనకు అర్పణగా మిమ్మును మీరు అర్పించుకోండి. నిజమైన ఆధ్యాత్మికతనూ, సమృద్ధియైన జీవాన్ని సంపూర్ణంగా మీరు అనుభవిస్తారు.

వాక్యము

Day 6

About this Plan

నిజమైన ఆధ్యాత్మికత

యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy