ప్రణాళిక సమాచారం

నిజమైన దేవుడునమూనా

నిజమైన దేవుడు

DAY 2 OF 7

దేవుడు సార్వభౌముడు


దేవుడు మంచివాడు. కానీ మన పరిస్థితుల నేపథ్యంలో శక్తిలేని మంచి దేవుడు ఎక్కువ విశ్వాసాన్ని ప్రేరేపించడు. విశ్వంలోని ప్రతీ ప్రదేశాన్ని శాసించే మంచి దేవుని గురించి ఏమిటి?


మన దేవుడు సమస్తానికి మించిన వాడు, సమస్తానికి ముందున్న వాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. 


అది ఆయనను సార్వభౌమునిగా చేస్తుంది. దాని అర్థం ఏమిటి?


సార్వభౌముడిగా ఉండడం అంటే దేవుడు అనేకమందిలో ఒక దేవుడు కాదు. ఆయన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ప్రతి ఇతర శక్తిమీదనూ, అధికారం మీదనూ పైనున్న అంతిమ శక్తి మరియు అధికారం ఆయనే. రాజులూ, అధ్యక్షుల ఆకాంక్షలకూ, విధి మలుపులకూ, లేదా విశ్వ నియమానికీ ఆయన లోబడి ఉండడు. ఆయన విశ్వం యొక్క నియమం.


నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.” (యెషయా 44:6).


మీరు దానిని అర్థం చేసుకున్నప్పుడు, మీరు ఆయనను సంపూర్ణంగా విశ్వసించగలరని మీకు తెలుసు.


·  ఆయన వాగ్దానాలు శూన్యమైన పదాలు కాదని మీరు విశ్వసించవచ్చు.


·  ఆయన మీ ప్రార్థనలను వింటాడు, వాటి విషయంలో కార్యం జరిగించడానికి ఆయన శక్తినీ, దృఢ చిత్తాన్నీ కలిగి ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు.


·  మీ రేపటి దినాలను ఆయన తన చేతులలో ఉంచుకొన్నాడనే నిశ్చయాన్ని మీరు పొందవచ్చు.


·  మీరు ఆయనను ఆరాధించవచ్చు, మీ ఆరాధనకు ఆయన అర్హుడని నిశ్చయంగా ఉండవచ్చు.


·  మీరు నిరాశకు గురవుతారనే ఎటువంటి భయం లేకుండా ఆయనను మీరు ప్రభువుగా అనుసరించవచ్చు.


·  మీరు ఆయన జ్ఞానం, ప్రేమ, శక్తి యొక్క భద్రతతో జీవించవచ్చు.


సార్వభౌమాధికారం అనే పదం ముఖ్యంగా మృదువుగా ఉండకపోవచ్చు. అయితే నిజమైన దేవుణ్ణి సమస్తం మీద  ప్రభువుగా చూడటం మీ విశ్వాసానికి కదిలించలేని పునాదిని ఇస్తుంది.

వాక్యము

Day 1Day 3

About this Plan

నిజమైన దేవుడు

నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకా...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy