ప్రణాళిక సమాచారం

ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

DAY 10 OF 10

మరొక అవకాశము

మన యొక్క కథ మరియు వేడుక కేవలం ఈస్టర్ నాటి వరకే పరిమితం కాదు. సెలవు దినములతో వచ్చిన చిక్కే ఇది, వాస్తవిక ప్రపంచంలో మరుసటి దినమునకు మాములుగా వెళ్ళిపోయి "ఇప్పుడు ఏం చేయాలి?" అన్న విధానములోనికి మారిపోతుంటాము. ఈ నాటి ధ్యానము, పాపము యొక్క శాపమును జయించిన యేసులో మనకు నూతన జీవమును తీసుకువచ్చే ఆ నమ్మిక యందు ఎలా కొనసాగాలి అన్న దాని యందు కేంద్రీకృతమై యుండును.


పేతురును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ వారము మొదట్లోనే అతను యేసును మూడుసార్లు ఎరుగనని చేప్పి చేసిన వంచనను గూర్చి మనం చదువుకున్నాము. ఈ రోజున అతనిని మరియు యేసును మరలా జ్ఞాపకం చేసుకుందాము.


యోహాను 21:15-19ను చదువుదాం.


పేతురు యొక్క ప్రేమను యేసు ప్రశ్నించెను.ఈ ప్రశ్నలు యేసు పేతురు నుండి ఏదో సమాధానం కోరుట కొరకని నాకనిపించలేదు కాని పేతురు కొరకని అనిపిస్తుంది. క్రీస్తు యెడల తనకున్నప్రేమను దృఢ పరచుటకే మూడుమార్లు పేతురునకు యేసు అవకాశమిచ్చినట్లు నాకనిపించింది. ఆ మూడుమార్లు పేతురు క్రీస్తు యెడల తనకున్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో కూడా యేసు తెలియజేసెను:"నా గొర్రెలను కాయుము", "నా గొర్రెలను మేపుము" మరియు "నా గొర్రెలను కాయుము."


మనము ఆయనను ప్రేమించున్నామన్న దానిని యేసుకు తెలుపే మార్గము మన కేవలం మాటలతో ముగిసిపోయేది కాదు. ఎవరైనా సిలువ గుర్తు గల ఒక గొలుసును ధరించుకొనవచ్చును, తమ ఫేస్ బుక్ ప్రొఫైల్ నందు క్రైస్తవ పరమైన వాటినే కలిగియుండ వచ్చును, లేక ఆదివారము నాడు చర్చికి వెళ్ళవచ్చును. మనము ఆయనను ప్రేమిస్తున్నామంటే ఆయన గొర్రెలను(ప్రజలను) జాగ్రత్తగా కాయవలెను అని యేసు చెప్పెను.


కేవలం తన ప్రజలను ప్రేమించమనే యేసు పేతురును అడుగలేదు కాని; ఆయన మరొక ఆజ్ఞను అతనికిచ్చెను.


యోహాను 21:19 మరలా చదువుము.


తనను వెంబడించుమని ఆయన పేతురునకు చెప్పెను. మన విమోచకుడైన యేసును గూర్చి ఎంత గొప్ప వర్ణన ఇది. తాను నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు తన చూపును యేసుమీద నుండి త్రిప్పుట మరియు క్రీస్తును తానెరుగనని ఒక్కసారి గాక మూడుమార్లు పేతురు చెప్పిన విషయముల వంటివన్నియు యేసు ఎంతమాత్రము పట్టించుకోలేదు. తనను వెంబడించుమనే ఆహ్వానమును యేసు మరలా పేతురునకు అందించెను.


"దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్దిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొరకు తన ప్రాణము పెట్టును."
-యేసు (యోహాను 10:10-11)

నీ గురించి యేసుకు సమస్తం తెలియును- దొంగ (సాతాను) నీ జీవితము నందు దోచుకొని, నాశనము చేసినదంతయు ఆయనకు తెలియును-అయినప్పటికి యేసు నిన్ను ప్రేమించుచున్నాడు మరియు సమృద్ధియైన జీవితమును నీవు జీవించవలేనని ఆయన ఆశిస్తున్నాడు.


ఆయన యొక్క ప్రేమ, జీవము మరణ పునరుత్ధానమును బట్టి -నీవు అద్భుతమైన వ్యక్తివి! లెమ్ము, యేసును వెంబడిస్తూ మరియు ఆయన గొర్రెలను ప్రేమిస్తూ నీ యొక్క సమృద్ధియైన జీవితమును జీవించుము!


వాక్యము

Day 9

About this Plan

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy