ప్రణాళిక సమాచారం

మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక నమూనా

మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక

DAY 1 OF 14

బాగుగా వేయబడిన ప్రణాళికలు

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. - ఎఫెసీ 6:12

"అసలు నువ్వు ఎలా చేసావు?" హెలెన్ అరిచింది. "మీరు ఎప్పుడైనా అలాంటి పని ఎలా చేయగలరు?"

టామ్ నిస్సహాయంగా తన భార్య వైపు చూసాడు. అతను వ్యభిచారం చేసాడు, అతని పాపపు క్రియల్లో ఉన్నాడు మరియు అతనిని క్షమించమని భార్యను కోరాడు.

"కానీ అది తప్పు అని మీకు తెలుసు," ఆమె చెప్పింది. "ఇది మన వివాహమునకు (వివాహ బంధమునకు) అంతిమ ద్రోహం అని మీకు తెలుసు."

"ఈ సంగతి జరగడానికి నేను ఎప్పుడూ ప్రణాళిక చేయలేదు," అని టామ్ కళ్ళలో కన్నీళ్లతో అన్నాడు.

టామ్ అబద్ధం చెప్పడం లేదు. అతను కొన్ని చెడు ఎంపికలు చేసి యున్నాడని అతనికి తెలుసు, కాని అతను తన క్రియల యొక్క పర్యవసానములను గురించి ఆలోచించలేదు. దాదాపు ఒక గంట అభ్యర్ధన తరువాత, హెలెన్ అర్థం చేసుకోవటానికి మరియు చివరికి క్షమించటానికి సహాయపడే విషయం ఏదో చెప్పాడు.

"నేను వ్యభిచారం చేయటానికి ముందు నేను నీకు పరి పరి విధాలుగా నమ్మకద్రోహం చేశాను." వారు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి చాలా బిజీగా ఉండటం, అతని విమర్శనాత్మక వైఖరి, ఆమె అప్పుడప్పుడు ఉద్రేకములకు ప్రతిస్పందన లేకపోవడం, ఆఫీసు వద్ద సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఆమె అతని మాట వినకపోవడం కారణాలు కావచ్చు. "చిన్న విషయాలు, ఎల్లప్పుడూ చిన్న విషయాలు," అని అతను అన్నాడు. "కనీసం ప్రారంభంలో వారు అలా ఉండేవారు."

మానవ జీవితంలో సాతాను ఖచ్చితంగా ఇలాగే పనిచేస్తాడు. అతను చికాకు, అసంతృప్తి, అసహ్యకరమైన ఆలోచనలు, సందేహాలు, భయాలు మరియు తార్కికాలతో తెలివిగా రూపొందించిన నమూనాలతో మన మనస్సులలో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రారంభిస్తాడు. అతను నెమ్మదిగా మరియు జాగ్రత్తగా కదులుతాడు (ఇవన్ని జరిగిన తరువాత, చక్కగా వేసిన ప్రణాళికలకు సమయం పడుతుంది).

హెలెన్ తనను నిజంగా ప్రేమిస్తున్నదా లేదా అనే అనుమానం రావడం ప్రారంభించిందని టామ్ చెప్పాడు. ఆమె వినలేదు మరియు అతని లైంగిక మనోభావాలకు ఆమె ఎప్పుడూ స్పందించలేదు. అతను ఆ ఆలోచనలలో జీవించాడు. అతను ఇష్టపడనిది ఏదైనా అమె చేసినప్పుడు, అతను దానిని గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు. అతను వాటిని తన అసంతృప్తి జాబితాలో గుర్తు పెట్టుకోవడం మరియు వాటిని గురించి ఎక్కువగా ఆలోచించేవాడు.

అతనితో కలిసి పని చేసే వారిలో ఒకరు అతని సమస్యలను విని అతనికి సానుభూతి ప్రకటించింది. ఒక సారి ఆమె, “మీలాంటి ప్రేమించే, శ్రద్ధగల వ్యక్తితో ఉండుటకు హెలెన్ కు అర్హత లేదు.” అని చెప్పింది. (సాతాను కూడా ఆమెలో పనిచేశాడు.) ప్రతిసారీ టామ్ సరైన మార్గమును విడిచి ఒక చిన్న తప్పు అడుగు వేసినప్పుడు, అతను తన చర్యలను తన మనస్సులో సమర్థించుకున్నాడు: హెలెన్ నా మాట వినకపోయినా, నన్ను ఇష్టపడే ప్రజలు ఉన్నారు. అతను ప్రజలు అనే పదాన్ని తనతో తాను చెప్పినప్పటికీ, అతను నిజంగా తదుపరి క్యూబికల్‌లోని స్త్రీని ఉద్దేశించి అనుకున్నాడు. 

తన సహోద్యోగి విన్నది. కొన్ని వారాల తరువాత, అతను ఆమెను కౌగిలించుకున్నాడు మరియు అతను అలా చేస్తున్నప్పుడు, అతను తన భార్య నుండి శ్రద్ధగల ప్రతిస్పందనను అనుభవించాలని కోరుకున్నాడు. ఇది హానిచేయని ఆలింగనం-వలె అనిపించింది. సాతాను ఎప్పుడూ ఆతురుతలో లేడని టామ్ గ్రహించలేదు. అతను తన ప్రణాళికలను రూపొందించడానికి సమయం పడుతుంది. అతను శక్తివంతమైన కోరికలతో ప్రజలను వెంటనే త్వర పెట్టడు. దానికి బదులుగా, మన మనస్సు యొక్క శత్రువు చిన్న విషయాలతో మొదలు పెడుతుంది - అవేవనగా చిన్న అసంతృప్తి, చిన్న కోరికలు-మరియు అక్కడ నుండి నిర్మించడం ప్రారంభిస్తుంది.

టామ్ కథ నలభై రెండేళ్ల బుక్ కీపర్ కథ లాగా ఉంది, ఆమె సంస్థ నుండి దాదాపు మూడు మిలియన్ డాలర్లను దొంగిలించినట్లు నేరం మోపబడింది. ఆమె, “నేను మొదటిసారి పన్నెండు డాలర్లు మాత్రమే తీసుకున్నాను. నా క్రెడిట్ కార్డులో కనీస మొత్తాన్ని చెల్లించడానికి నాకు చాలా అవసరం. దాన్ని తిరిగి చెల్లించాలని ప్లాన్ చేశాను.” ఎవరూ ఆమెను పట్టుకోలేదు, రెండు నెలల తరువాత, ఆమె మళ్ళీ “అరువు” తీసుకుంది.

వారు ఆమెను పట్టుకునే సమయానికి, సంస్థ దివాళా తీయబడింది. "నేను ఎవరినీ బాధపెట్టాలని లేదా ఏదైనా తప్పు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు" అని ఆమె చెప్పింది. ఆమె పెద్ద మొత్తం దొంగిలించాలని ఎప్పుడూ అనుకోలేదు - చిన్న మొత్తాలను తీసుకోవటానికి కూడా ఎప్పుడూ ఉద్దేశించలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆమె కంపెనీ నుంచి దొంగిలించిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.

ఆ తప్పుడు ఆలోచనలను మన మీద వేసుకోవడానికి మనము అనుమతించాల్సిన అవసరం లేదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు, “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, ....బలముకలవై యున్నవి.... [We] మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి...” (2 కొరింథీ 10:4–5).

ప్రభువైన యేసు, నీ నామములో, నేను విజయం కొరకు మొర్ర పెట్టుచున్నాను. ప్రతి ఆలోచనను విధేయతలోకి తీసుకురావడానికి నన్ను బలపరచండి. సాతాను మాటలు నా మనస్సులో ఉండటానికి మరియు నా విజయాన్ని దొంగిలించడానికి అనుమతించవద్దు. ఆమెన్.

Day 2

About this Plan

మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక

ఈ ధ్యాన మాలిక కోపం, గందరగోళం, ఖండించడం, భయం, సందేహం జయించడానికి నిరీక్షణ యొక్క ప్రేరణలతో మిమ్మల్ని సిద్ధం చేస్తుంది...మీరు దీనికి పేరు పెట్టండి. ఈ అంతర్దృష్టులు మిమ్మల్ని గందరగోళపరిచే మరియు అబద్ధం చెప్పే శత్రువు యొక్క పధ...

More

ఈ ప్రణాళికను అందిస్తున్నందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు కృతఙ్ఞతలు. మరిన్ని వివరముల కొరకు దయచేసి దర్శించండి: tv.joycemeyer.org/telugu​​​​​​​

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy