ప్రణాళిక సమాచారం

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాంనమూనా

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

DAY 3 OF 5

దయా సంస్కృతి  

నినెవే ప్రజలు మొట్టమొదిటిగా దేవుని ప్రేమాపూరిత దయనూ, కరుణనూ అనుభవించారు. వారి యదార్ధమైన పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు వారిని నాశనం చెయ్యకుండా ఆయన జాలిపడ్డాడు. తమ పాపంలోనూ, దుర్మార్గతలోనూ కఠినంగా మారిన ప్రజలను దేవుడు అంత సులువుగా క్షమిస్తాడనే వాస్తవాన్ని యోనా జీర్ణించుకోలేక పోయాడు. తాను సహితం దేవుని కృపను పొందాడనీ, జీవితంలోనూ, పరిచర్యలోనూ రెండవ అవకాశాన్ని పొందడం ద్వారా పునరుద్ధరించబడ్డాడనే వాస్తవాన్ని మరచిపోయాడు. కొన్నిసార్లు మనలో చాలామంది ఇలానే ఉంటాము కదా? మనం ఏవిధంగా క్షమించబడ్డామో కొన్ని సార్లు మరచిపోతాము, ప్రజల లోపాలూ, నలిగిన స్థితి, వారి పైరూపం మీద లక్ష్యముంచుతాము, వారి గురించీ లేక వారి ప్రయాణం గురించీ అవగాహన లేకుండా వారి మీద కఠినమైన తీర్పులు చేస్తుంటాము. దురభిమానం ఒక విషపూరిత లక్షణం. అది లోతుగా గాయం చేస్తుంది, సంబంధాలను చంపివేస్తుంది. మన దేవుడు రెండవ అవకాశాల దేవుడు అనీ, ఎటువంటి పరిమాణం లేకుండా క్షమించువాడనీ, ఖచ్చితంగా ప్రేమించువాడనీ మనం మరచిపోవద్దు. ప్రతీ సమయంలోనూ మనం దయను ఎంచుకోవాలి, తీర్పుతోకూడిన తలంపులనూ, వైఖరులనూ మన మనసులలోనుండి నిరంతరం తప్పించాలి. దీనికి క్రమశిక్షణ అవసరం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే మనసు నూతణీకరణ అవసరం.

పాపులైన మనుషులమైన మనలను దేవునితో సమాధానపరచడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించాడు. మనుష్యులు తమ సృష్టికర్తతో సమాధానపడేలా మనం వారిని ఆయన వద్దకు నడిపిస్తున్నాము. మనం ప్రజల విషయంలో దురభిమానాన్ని చూపించినప్పుడు, మనలో వారు దేవుణ్ణి చూడడం అసాధ్యం,  అటువంటి వ్యక్తికీ మనకూ మధ్య మనం ఆజాగ్రత్తతో ఒక గోడను సృష్టిస్తున్నాము.  

అపొస్తలుడైన పేతురుకు తన పెంపకాన్ని బట్టి మాంసం విషయంలో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి, అయితే పరిశుద్ధాత్మ దేవుడు  తాను సృష్టించినవాటిని ఎటువంటి మినహాయింపులు లేకుండా అంగీకరించేలా అతనిని ఒప్పింప చేసాడు, నమ్మేలా చేసాడు. పరిశుద్ధాత్ముడు అన్యజనుల హృదయాలలో ఇంతకుముందు నుండి చేస్తున్న దానికీ, ప్రపంచం నలుమూలలకూ సువార్త వాస్తవంగా చేరడానికి ఇది ప్రారంభం అని పేతురు కొద్దిగా గుర్తించాడు. పేతురు విధేయత చూపాడు, కొర్నేలికీ అతని కుటుంబానికంతటికీ పరిచర్య చేసాడు. ఆ విధంగా సంఘం కోసం నూతన అధ్యాయానికి ప్రేరణ కలిగించాడు. 

దురభిమానం లక్షణం సంఘంలో పరిశుద్ధాత్మ అనియంత్రిత కదలికను అడ్డుకొంటుంది. అంగీకారం, ప్రేమ వారధులను నిర్మిస్తాయి, పరిశుద్ధాత్మ ఉచిత పాలనను అనుమతిస్తాయి.

Day 2Day 4

About this Plan

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

బైబిలు గ్రంథం మన అద్దంగా బైబిలుతో మనల్ని మనం అధ్యయనం చెయ్యడానికి యోనా గ్రంథం ఒక గొప్ప మార్గం, దాచబడిన మన పూర్వభావనలనూ, లోపాలనూ కనుగొంటూ, దేవుడు మనలను ఉంచిన స్థలాలలో దేవునికి శ్రేష్ఠమైన రీతిలో సేవచేయ్యడం గురించి తెలుసుకోవ...

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.co

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy