ప్రణాళిక సమాచారం

శరీరేచ్చ శోధన నదిగమించుట నమూనా

శరీరేచ్చ శోధన నదిగమించుట

DAY 1 OF 3

సుశిక్షత/పవిత్ర విధానంలో అశీల దృశ్యాల [వీక్షణ] శోధన నధిగమించుట 


2016 వ సంవత్సరం మార్చి నెలనుండి వివస్త్రలైన స్త్రీల చిత్రాలు ప్రచురించబడవు అనే పత్రికా ప్రకటన నొకటి ప్లే బాయ్ అనే పత్రికలో చూసాను. ఈ సమాచారాన్ని దక్కను క్రానికల్[అక్టోబర్13, 2015] భారతీయ వార్తా పత్రిక నుండి సేకరించాను. ఈ నిర్ణయం వెనుకగల కారణాన్నిఆ కంపెనీ ప్రధానాధికారి తెలియజేస్తూ వచ్చాడు. “యుద్ద పోరాటం గెలుపొంది ముగిసింది” ఊహించగల ప్రతి లైంగికచర్యకు నీకు మధ్య దూరం ఒక్క క్లిక్ మాత్రమే. “కాబట్టి ఈ పరిస్థితిలో కేవలం ఇదిలా దాటించబడింది” ఆన్ లైన్ ద్వారానైనట్టి  లైంగిక శోధన ఎంత శక్తివంతమైనదో ఈవాంగ్మూలం తెలియజేస్తుంది. అది ఒక్క క్లిక్ దూరం మాత్రమే. వైర్డ్ ఫర్ ఇంటిమసి అనే తన గ్రంధంలో లైంగిక పాపం పురుషుడి మెదడును ఏ విధంగా అడ్డగించి అపహరిస్తుందో విలియం స్త్రూతర్ రచిస్తూ, సులభంగా వినియోగించగలుగుట, వెచ్చించ గలుగుట మరియు అస్పష్టత అనే ఈ మూడు ప్రత్యేకంగా ఆన్ లైన్ శృంగార శోధనను జయించడాన్నిఎంతో కష్టతరం చేసాయి అనే విషయాన్నిచర్చించాడు.


సర్వ జనీనమైనట్టి ఈ సమస్యకు పరిష్కారం ఒకటి చూపించమని తెరిచిన బైబిలు చేత పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్లాను. గేయ [ప్రాస] రూపకమైనట్టి మూడు పదాలను దేవుడు నాకిచ్చాడు. ఇవి అపవిత్రమైన మురికి చిత్రాలను వీక్షించే శోధనను/అలవాటును జయించడంలో సహయకరం కాగలవు. నేటి మన ధ్యానంలో ఈ మొదటి మాటను మీకు తెలియజేస్తాను “ [గ్రూమ్]పెండ్లికొడుకు . 


లైంగిక చిత్రాల శోధనను జయించడానికి మొదటి మెట్టు: మన కొరకు రక్తం చిందించి సిలువలో మరణించింన పెండ్లికుమారుడైన  యేసు ప్రేమలో జీవించడం, మత్తయి 25:1- 13 వచనాల భాగం యేసును మనకు పెండ్లి కుమారుడుగా చూపుతూ వుంది. యేసుకు పెండ్లి కుమార్తెయైన మనం అంతకంతకూ ఆయన ప్రేమలో మునిగి పోవాలి. [ప్రకటన 2 : 4] మనం మన మొదటి ప్రేమను ఎప్పటికీ విడువకూడదు. ఆయన అద్భుత ముఖార విందాన్ని చూడడంలో మనం పూర్తిగా ఆనందించేవారమై వుండాలి. ఈ విధంగా మనం చేసినపుడు లైంగిక అశీల దృశ్యాల శోధనతో పాటుగా ఇతర లౌకిక విషయాలన్నీఆశ్చర్యకరంగా మసకబారి పోతాయి. మనం మన ప్రేమను యేసు ఎడల ప్రకటించినపుడు ఆయన ఆజ్ఞలకు సహజంగా విధేయత చూపగలం. బైబిలు పలుమార్లు ఈ విషయాన్ని మనకు బోధిస్తూ వుంది [యోహాను 14 : 15, 23] యేసును బహుగా మనం ప్రేమించినట్టయితే సునాయాసంగా లైంగిక అపవిత్ర /అశీల దృశ్యాల శోధనను తప్పించుకోగలం. మనం ఉద్దేశ్య పూర్వకంగా ఏసుకు వ్యతిరేకంగా పాపం చేయడం జరిగితే, ఆ జాబితా లో అశీల దృశ్యాలను వీక్షించడానికి బుద్ధిపూర్వకంగా కొంత సమయాన్ని కేటాయించడం కూడా ఒక పాపమై యుండగలదు. ఇది ఆయన రక్తాన్ని తొక్కడం వంటిదే, ఆయన ప్రేమను త్రోసిపుచ్చడమే అవుతుంది. [హెబ్రీ 10 : 26 – 29]. యేసు మన పెండ్లి కుమారుడైన చిత్రం మనం అశీల దృశ్యాల వీక్షణను వద్దు, వద్దు అని చెప్పడానికి మనలను బలపరుస్తుంది.   

Day 2

About this Plan

శరీరేచ్చ శోధన నదిగమించుట

అశీల దృశ్యాలను వీక్షించే శోధనను అధిగమించుటలో క్రియాశీలక విధానాలను బైబిలు నుండి కనుగొనుటలో చదువరులకు సహాయం చేస్తుంది.  

ఈ ప్రణాళికను అందించడానికి డ్యూక్ జయరాజ్కు మేము ధన్యవాదాలను కోరుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.facebook.com/dukebook

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy