ప్రణాళిక సమాచారం

జవాబుదారీతనంనమూనా

జవాబుదారీతనం

DAY 7 OF 7

క్రీస్తు శరీరమునకు జవాబుదారులమైయుండుట – సంఘము. 


 క్రీస్తు శరీరంలో మనం జవాబుదారులమై యున్నాం. యేసును వెంబడించే నేను పాపంలో జీవిస్తున్నట్టయితే నేను ఏదో విధంగా క్రీస్తు యావత్ శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాను [యెహోషువా గ్రంధం వ అధ్యాయం]లో ఇశ్రాయేలు ప్రజలందరిపైకి తన పాపం చేత కీడు తీసుకొని వచ్చిశతృ దాడికి గురి చేసిన ఆకాను వలె.... క్రైస్తవ విశ్వాసులు పాపం చేస్తే యావత్ క్రీస్తు శరీరం బలహీనపరచబడి శక్తిహీనమవుతుంది. తమ స్వంత కుటుంబాలతో మొదలెట్టి, సంఘంలో ఎవరైనా ఒక సహోదరుడు పాపంలో తచ్చాడుతున్నట్టయితే అతణ్ణి ఎదుర్కొని ప్రేమతో పునరుద్ధరించడం, దారికి తీసుకొని రావడం క్రీస్తు శరీరంలో భాగమై యున్నమీలో ప్రతి ఒక్కరి బాధ్యత [గలతీ 6:1]. క్రీస్తు శరీరంలో ఒకరికి ఒకరు ఎంతో ఆవసరం. 


 తమ విశ్వాసంలో వారు బలపడునట్లుగా బలహీన సహోదరులకు సహాయం చెయ్యడంలో పరిణితి నొందిన విశ్వాసులు ఎలా జీవించాలో పౌలు తెలియజేస్తూ వచ్చాడు. వారిని నిర్మించడానికి బదులుగా బలహీన సహోదరులను బలవంతులు తొట్రిల్ల జేయకూడదు. 


 I కొరింథీ 12 లో వ్రాయబడిన రీతిగా సంఘంలోని మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక తలాంతులివ్వబడ్డాయి, ప్రేమ కనికరాలతో మనం ఇతరులను చేరుకొవడానికి దేవుని మహిమార్ధం మనకు కృపావరాలివ్వబడ్డాయి. చాలాసార్లు మనం ఈ కృపావరాలను స్వార్ధానికి మన దురాశలకు ఉపయోగించుకొనే ప్రయత్నంలో వుంటాం. మనకివ్వబడిన కృపావరాలపై మనం బాధ్యులం, మరియు జవాబుదారులమై యుంటాం 


 అపొస్తలుడైన పౌలు I కొరింథీ6లో విశ్వాసుల మధ్య వ్యాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు శరీరంలోని సహోదరుల మధ్య వివాదం ఎలా పరిష్కారం కావాలో మత్తయి 18: 15-17లో యేసు చెప్పాడు. ఈ రోజున సంఘంలో మనలో ప్రతి ఒక్కరూ తమ నాయకత్వంలో దేవునికి జవాబుదారీగా ఉండాలని గ్రహించాలి. అనేకసార్లు సంఘాలు వివాదాల వలన విచ్ఛిన్నమవుతాయి. క్రీస్తు శరీరం యొక్క సభ్యులుగా, మన శరీరాన్ని పోషించడానికి మరియు సంరక్షించడానికి మనం బాధ్యులం మరియు దానిని నాశనం చేసినపుడు మనకు బాధ్యత ఉందని క్రీస్తు శరీరాన్ని నాశనం చేసేవారికి కలగబోయే శిక్షను గురించి 1 కొరింథీ. 3:16, 17. తెలియజేయబడినది. 


దిన తలంపు:  


విశ్వాసులు క్రీస్తుకు సమర్పించుకొన్నపుడు ఒకరికి ఒకరు కూడా లోబడగలరు 


ప్రార్ధన: 


ప్రియమైన యేసు ప్రభువా, క్రీస్తు శరీరంలోని సహోదరులు, సహోదరీలకు లోబడుటకు నాకు సహాయం చెయ్యండి. క్రీస్తు శరీరంలో నీ పోలిక లోనికి నేను అభివృద్ధి చెందునట్లు నా జీవిత ప్రతి భాగమును పరిశుద్ధపరచండి. 

Day 6

About this Plan

జవాబుదారీతనం

 సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవున...

More

ఈ ప్రణాళికను అందించినందుకు విక్టర్ జయరాకరన్కి మేము ధన్యవాదములు కోరుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://victorjayakaran.blogspot.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy